Anil Ravipudi : ఎఫ్2 రిలీజై మూడేండ్లయ్యింది... ఎఫ్ 3 మామూలుగా ఉండదు

Published : Jan 12, 2022, 01:52 PM ISTUpdated : Jan 12, 2022, 02:11 PM IST
Anil Ravipudi : ఎఫ్2 రిలీజై మూడేండ్లయ్యింది...  ఎఫ్ 3 మామూలుగా  ఉండదు

సారాంశం

Anil Ravipudi : విక్టరీ వెంకటేష్, మెగా  ప్రిన్స్ వరుణ్ తేజ్ కథనాయకులుగా నటించగా అనిల్ రావిపూడి దర్శకత్వవం వహించిన ఎఫ్2 మూమీ రిలీజ్ అయ్యి మూడేండ్లయ్యింది. ఈ  సందర్భంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి ట్విట్టర్ లో ఎఫ్2 ఫన్ అండ్ ఫ్రస్టేషన్ రైడ్ రిలీజ్ అయ్యిందని ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు.   

తెలుగు సినిమా చిత్రికరణలో తనకుంటన్న ప్రత్యేకత సంపాధించుకున్న దర్శకుల్లో అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఒకరు. రాజా ది గ్రేట్, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్ 2 ఫన్ అండ్ ఫ్రస్టేషన్ తో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సాధించుకున్నారు. అనిల్ రావిపూడి సినిమా మొదలైందంటేర సినీ ప్రియుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. అదే ఆసక్తి ప్రస్తుతం చిత్రీకరణ కొనసాగుతున్న ‘ఎఫ్3’పై కూడా  ఉంది.

అయితే ఎఫ్2 చిత్రం విడుదల చేసి మూడేండ్లయ్యిన సందర్భంగా అనిల్ రావిపూడి అదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.  ఎఫ్3 మూవీని శ్రీ వేంకటేశ్వర  క్రియేషన్స్ రూపొందిస్తోంది. కాగా మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ మంచి సంగీతాన్ని అందించనున్నారు. 
అయితే ఎఫ్2లో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ లకు జోడీగా నటించిన తమన్నా, మెహరిన్ ఫిర్జాడ నటించారు. వీరి జోడికి ప్రేక్షకులు ఓటేయడంతో ఎఫ్3లోనూ వీరే నటించనున్నారు. సునిల్, మురళి శర్మలు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

 

దీంతో ఎఫ్2కి మించిన కామెడీ, ఫ్రస్టేషన్, మంచి ఫ్యామిలీ సీన్స్ ఉంటాయని అభిమానులు ఆశిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే అనిల్ రావిపూడి ఎఫ్3 మూవీ  త్రిబుల్ ఫన్ డోస్ తో రానుందని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.  కాగా మిల్క్ బ్యూటీ తమన్నా, మెహరిన్ ఫిర్జాడ తమ అభిమానులను అలరించేందుకు మరింతగా కష్టపడుతున్నారు. ఎఫ్3తో ఈ అక్కా చెళ్లళ్లు కనువిందు చేయనున్నారు. సినిమా ఏప్రిల్ 29కి రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధం అవుతోంది. ఇందుకు సంబంధించిన చిత్రీకరణ పనులు శర వేగంగా కొనసాగుతున్నాయి. 
 

PREV
click me!

Recommended Stories

Bandla Ganesh: రాంచరణ్ పెద్ది కోసం పవన్ కళ్యాణ్ త్యాగం.. బండ్ల గణేష్ కామెంట్స్ వైరల్
Maa Inti Bangaram Review: మా ఇంటి బంగారం మూవీ రివ్యూ.. సమంత కమ్‌ బ్యాక్‌ ఫిల్మ్ ఎలా ఉందంటే?