సినిమా గోడును పట్టించుకునే వాళ్లు లేరు.. ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం.. వివాదంపై బాలకృష్ణ

By Sumanth KanukulaFirst Published Jan 12, 2022, 1:36 PM IST
Highlights

తెలుగు సినీ పరిశ్రమకి ఇరు రాష్ట్ర ప్రభుత్వాల సహకారాలు ఉండాలని అని సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (nandamuri balakrishna) అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్దిల్లాలి అని ఆకాంక్షించారు. 

తెలుగు సినీ పరిశ్రమకి ఇరు రాష్ట్ర ప్రభుత్వాల సహకారాలు ఉండాలని అని సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (nandamuri balakrishna) అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్దిల్లాలి అని ఆకాంక్షించారు. బుధవారం నిర్వహించిన అఖండ సక్సెస్‌ మీట్‌లో (Akhanda Success Meet) పాల్గొన్న బాలకృష్ణ ఈ వ్యాఖ్యలు చేశారు. చిన్న సినిమా, పెద్ద సినిమా అన్న తేడా ఉండదని వ్యాఖ్యానించారు. పెద్ద సినిమా ఫెయిల్ అయితే దాన్ని చిన్న సినిమా కూడా అనరని అన్నారు. కానీ చిన్న సినిమా హిట్ అయితే దానిని పెద్ద సినిమా అంటారని చెప్పారు. 

సినీ ఇండస్ట్రీలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికీ ఉపాధి లభించాలని ఆకాంక్షించారు. టికెట్లతో ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని అన్నారు. సినిమా బాగుండాలనేదే తన కోరిక అని చెప్పారు. విజయాలకు పొంగిపోవడం, అపజయాలకు కుంగిపోవడం తన డిక్షనరీలో లేదని చెప్పారు. 

అలాగే ఏపీలో సినిమా టికెట్ల ధరల వివాదంపై నందమూరి బాలకృష్ణ స్పందించారు. సినిమా గోడును పట్టించుకనేవాళ్లే లేరని అన్నారు. ఏపీలో సినీ పరిశ్రమ వివాదంపై కలిసికట్టుగా ఉండాలని కోరారు. టికెట్ ధరలపై పరిశ్రమ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని వెల్లడించారు.  
 

click me!