Radhe Shyam:'అఖండ' ఎఫెక్ట్...'రాధేశ్యామ్' లో పెద్ద మార్పు

Surya Prakash   | Asianet News
Published : Dec 13, 2021, 03:11 PM IST
Radhe Shyam:'అఖండ' ఎఫెక్ట్...'రాధేశ్యామ్' లో పెద్ద మార్పు

సారాంశం

1960ల కాలం నాటి ప్రేమ కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా.. ప్రేక్షకులకు తప్పకుండా మెప్పింస్తుందని ఈ చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. 

 కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ తర్వాత విడుదలై.. థియేటర్లకు పూర్వవైభవాన్ని తీసుకొచ్చిన చిత్రంగా ‘అఖండ’ నిలిచింది. విడుదలైన తొలిరోజు నుంచే విశేష ప్రేక్షకాదరణ పొందుతూ ఇతర పెద్ద చిత్రాల విడుదలకు భరోసానిచ్చింది. ఈ సినిమా పది రోజుల్లో రూ. 100 కోట్లు (గ్రాస్‌ వసూళ్లు) కలెక్ట్‌ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి స్పెషల్‌ షోలు లేకుండా, పరిమిత టికెట్‌ ధరలకే ఇన్ని కోట్ల వసూళ్లు సాధించడం విశేషం. ఈ హిట్ ఎఫెక్ట్ రాబోయే సినిమాలపై పడబోతోంది. నిర్మాతలలో ఉత్సాహం కలిగిస్తోంది. అది ప్రక్కన పెడితే అఖండకు ఇచ్చిన రీరికార్డింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సెన్సేషన్ గా మారి తమన్ కు పెద్ద పేరు తెచ్చిపెట్టింది. అంతేకాదు ప్రభాస్ తాజా చిత్రం రాధేశ్యామ్ కు రీరికార్డింగ్ ఆఫర్ ఇప్పించిందని సమాచారం.

 యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా వస్తోన్న చిత్రం ‘రాధేశ్యామ్’. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషన్ వీడియోస్, సాంగ్స్ కు అన్ని వర్గాల నుంచి మంచి స్పందన లభించింది. ఈ సినిమాకి ‘జిల్’ మూవీ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, కృష్ణం రాజు సమర్పణలో గోపీ కృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాలో విక్రమాదిత్య పాత్రలో క్లాస్ లుక్ లో కనిపించనున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే ప్రేరణ పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా కూడా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. 1960ల కాలం నాటి ప్రేమ కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా.. ప్రేక్షకులకు తప్పకుండా మెప్పింస్తుందని ఈ చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. 

ఈ రొమాంటిక్ లవ్ స్టోరీకి మ్యూజిక్ డైరెక్టర్ గా జస్టిన్  ప్రభాకరన్ పనిచేస్తున్నారు. ఆయన పాటలు అందిస్తున్నారు. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు తమన్ ని తీసుకోబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మధ్య తమన్ మ్యూజిక్ అదరగొడుతున్న సంగతి తెలిసిందే. బన్నీ హీరోగా వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమాకి అందించిన మ్యూజిక్ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. దాంతో ఈ సినిమా కూడా రొమాంటిక్ గా ఉండే చిత్రం కావటం, అఖండ సూపర్ హిట్ కావటంతో తమన్ ని బెస్ట్ ఛాయిస్ గా భావిస్తున్నారు. దీంతో రాధేశ్యామ్ టీం తమన్‌కు ఛాన్స్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sudigali Sudheer Rashmi Gautam లవ్‌ స్టోరీ తెగతెంపులు.. అందరి ముందు ఓపెన్‌గా ప్రకటించిన జబర్దస్త్ కమెడియన్‌
కాసుల వర్షం కురిపిస్తున్న రాజా సాబ్, ప్రభాస్ సినిమా 3 రోజుల కలెక్షన్స్ ఎంతంటే?