సమంతకు అస్వస్థత..ఆసుపత్రిలో చికిత్స, నిజమెంత..?

Surya Prakash   | Asianet News
Published : Dec 13, 2021, 02:40 PM ISTUpdated : Dec 13, 2021, 07:37 PM IST
సమంతకు అస్వస్థత..ఆసుపత్రిలో చికిత్స, నిజమెంత..?

సారాంశం

సమంత అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినట్టు వార్తలు వచ్చాయి. దీనిపై సమంత మేనేజర్ ఒక ప్రకటనను విడుదల చేసారు. 

ప్రముఖ నటి సమంతకు తీవ్ర అస్వస్థత గురయ్యారు. నిన్న కడప పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు చేరుకున్నారు సమంత.  హైదరాబాద్ చేరుకున్న కొన్ని గంటల్లోనే అస్వస్దతకు గురైంది. తీవ్రమైన జలుబు, వైరల్ ఫివర్ తో సమంత ఇబ్బందిపడుతున్నట్టు ప్రాధమిక సమాచారం. హైదరాబాద్ లోని ఎఐజి అసుపత్రిలో సమంత చికిత్స తీసుకున్నట్టు సమాచారం. 

ఈ వార్త గుప్పుమన్న తరువాత... సమంత మేనేజర్ ఒక ప్రకటనను విడుదల చేసారు. సమంత కొద్దిపాటి దగ్గుతో బాధపడుతున్నారని, AIG ఆసుపత్రిలో అన్ని రకాల పరీక్షలు చేపించుకున్నారని, కొద్దిగా రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని, ఇందులో కంగారు పడాల్సిన అవసరం లేదని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.  

కడపలో మాంగళ్య షాపింగ్ మాల్ 11 వ షోరూమ్ ప్రారంభమైంది. కొత్త బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ షోరూమ్‍‌ను హీరోయిన్ సమంత, డిప్యూటీ సీఎం అంజాద్ బాష, ఆర్టీసీ ఛైర్మన్ మల్లిఖార్జున రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. మంగళవాయిద్యాలు, నృత్యాలతో సమంతకు స్వాగతం పలికారు. సమంతను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. 

వేలాదిగా అక్కడికి తరలివచ్చారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి క్రౌడ్‌ను కంట్రోల్ చేశారు.  ఈ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి రావడం చాలా సంతోషంగా ఉందని, 10 సంవత్సరాల తరువాత మీ ముందుకు రావడం మరీ సంతోషంగా ఉందన్నారు సమంత. ఈ మాంగళ్య షాపింగ్ మాల్ తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు సమంత. 

ఇక ప్రస్తుతం సమంత..ఓ స్పెషల్ సాంగ్ చేసింది. అల్లు అర్జున్‌-క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో తాజాగా తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం స్మిగ్లింగ్‌ నేపథ్యంలో పాన్‌ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో తొలి పార్ట్‌ను ‘పుష్ప ది రైజ్‌’ పేరుతో డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పుష్ప టీం ప్రమోషన్‌ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈ సినిమాలో సమంత పాట హైలెట్ కానుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Thanuja: కళ్యాణ్ పాడు చేసుకుంటున్నాడు, తనూజలో సడెన్ గా ఈ మార్పు దేనికోసం.. సూటిగా ప్రశ్నించిన అభిమాని
Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్