Pushpa:ప్రీ రిలీజ్ ఈవెంట్ సుక్కూ స్కిప్ చేయటానికి అసలు కారణం

Surya Prakash   | Asianet News
Published : Dec 13, 2021, 02:42 PM IST
Pushpa:ప్రీ రిలీజ్ ఈవెంట్ సుక్కూ స్కిప్ చేయటానికి అసలు కారణం

సారాంశం

 పుష్ప సినిమా రిలీజ్ కోసం బన్నీ ఆర్మీ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఈ సినిమా పోస్టర్లు , టీజర్స్, సాంగ్స్ అన్నీ సినిమా పై ఎక్సపెక్టేషన్స్ ను పెంచేశాయి. 


ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా నటించిన మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘పుష్ప’. రష్మిక హీరోయిన్. సుకుమార్‌ దర్శకుడు. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్‌ అనే ఎర్రచందనం స్మగ్లర్‌గా మాస్‌ రోల్‌లో కనిపించనున్నారు. రష్మిక ఆయన ప్రేయసి శ్రీవల్లి పాత్రలో నటించారు. డిసెంబర్‌ 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఆదివారం ప్రీ రిలీజ్ పంక్షన్  వేడుకలు నిర్వహించారు. రాజమౌళి, కొరటాల శివ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.  అయితే ఈ ఈవెంట్ లో సుకుమార్ కనపడక పోవటం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. అయితే తన సినిమా ప్రీ రిలీజ్ పంక్షన్ కు సుకుమార్ రాకపోవటం గురించి ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సనా కారణం చెప్పారు.

బుచ్చిబాబు సనా మాట్లాడుతూ...సుకుమార్ ముంబైలో ఉన్నారు. రికార్డింగ్ వర్క్ అక్కడ జరుగుతూంటే దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వర్క్ గత కొద్ది రోజులుగా ముంబైలో జరుగుతోంది. రిలీజ్ టైమ్ దగ్గర పడుతూండటంతో సుకుమార్, దేవి ఆ పనుల్లో బిజీగా ఉన్నారని తెలిపారు.

ఇక పుష్ప సినిమా రిలీజ్ కోసం బన్నీ ఆర్మీ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఈ సినిమా పోస్టర్లు , టీజర్స్, సాంగ్స్ అన్నీ సినిమా పై ఎక్సపెక్టేషన్స్ ను పెంచేశాయి. అలాగే రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ ఆ అంచనాలను తారాస్థాయికి చేర్చింది.  ఊర మాస్‌లుక్‌ లో అడవిలో హంగామా చేసిన పుష్ప రాజ్‌ ట్రైలర్ చూసి బన్నీ ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటున్నారు. ఇప్పటికే పుష్ప రాజ్‌తో సమంత ఓ స్పెషల్ సాంగ్ చేసింది.  ఊ అంటావా ఊహు అంటావా మామ అనే పాటకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది.

Also read Pushpa: పుష్ప ఒక్క మూవీ నాలుగు సినిమాల కష్టం.. బాలయ్యకు కంగ్రాట్స్ చెప్పిన బన్నీ

‘పుష్ప’ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ అయినప్పటికీ.. సినిమా అంతా అదే ఉండదని తెలిపారు. ఇది హ్యూమన్ వాల్యూస్ – భావోద్వేగాలు కలబోసిన చక్కని అనుభూతినిచ్చే సినిమా అని పేర్కొన్నారు ఇటీవలే మేకర్స్ తెలిపారు.  

Also read Allu Arjun: బాలయ్యకు అల్లు అర్జున్ పార్టీ.. అల్లు, నందమూరి బంధం బలపడుతోందే

PREV
Read more Articles on
click me!

Recommended Stories

M4M Movie Review: ఎం4ఎం మూవీ రివ్యూ, రేటింగ్‌.. జో శర్మ, మోహన్‌ వడ్లపట్ల సినిమా ఎలా ఉందంటే?
Sathi leelavathi Movie Review: సతీ లీలావతి మూవీ రివ్యూ.. లావణ్య త్రిపాఠి మూవీ ఎలా ఉందంటే?