వివాదాల 'లక్ష్మీస్ ఎన్టీఆర్'కి వర్మ గుడ్ బై!

Published : Sep 25, 2018, 04:56 PM IST
వివాదాల 'లక్ష్మీస్ ఎన్టీఆర్'కి వర్మ గుడ్ బై!

సారాంశం

దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జీవితంపై వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' మూవీ తెరకెక్కించనున్నట్లు అనౌన్స్ చేసి ఓ పోస్టర్ ని కూడా విడుదల చేశారు. 

దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జీవితంపై వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' మూవీ తెరకెక్కించనున్నట్లు అనౌన్స్ చేసి ఓ పోస్టర్ ని కూడా విడుదల చేశారు. వర్మ ఈ సినిమాను తీస్తానని చెప్పిన సమయంలో టీడీపీ నేతలు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

వారి విమర్శలకు, ఆరోపణలకు వర్మ ఫేస్‌బుక్‌ వేదికగా ధీటుగానే సమాధానాలు ఇచ్చారు. అయితే ఎవరు ఏమన్నా.. సినిమా తెరకెక్కించి తీరుతానని వర్మ తేల్చిచెప్పాడు. ఎన్టీఆర్‌ జీవితంలోని ప్రజలకు పెద్దగా తెలియని చీకటికోణాలను ఈ సినిమాలో ఆవిష్కరిస్తానంటూ వర్మ గతంలో చెప్పారు.

దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. సినిమాను అనౌన్స్ చేసి ఇంతకాలం అవుతున్నా.. ఇప్పటివరకు షూటింగ్ మాత్రం మొదలుకాలేదు. తాజాగా ఈ సినిమా ఆగిపోయినట్లు తెలుస్తోంది.

నిజానికి ఈ సినిమా 'ఎన్టీఆర్' బయోపిక్ కి పోటీగా విడుదల చేయాలనేది ప్లాన్. కానీ ఇప్పుడు 'లక్ష్మీస్ ఎన్టీఆర్' నిర్మాతలకు సినిమా చేయడానికి ఆర్ధిక సమస్యలు ఎదురుకావడంతో ఈ సినిమాను నిలిపివేసినట్లు తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు
Remuneration: సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న ఒకే ఒక్కడు.. ఆయన ముందు ప్రభాస్, విజయ్‌, అల్లు అర్జున్‌ జుజూబీ