మీకు ధోనీ ఒక్కడే దొరికాడా.. నాకు చాలా మంది వున్నారు

First Published Sep 22, 2017, 7:20 AM IST
Highlights
  • టాలీవుడ్ లో మెగా పవర్ సాంగ్స్ తో ఐటమ్ బాంబ్ గా లక్ష్మీ రాయ్ క్రేజ్
  • తాజాగా బాలీవుడ్ లో జూలీ2 అనే చిత్రంలో నటించిన రాయ్ లక్ష్మి
  • ప్రమోషన్ సందర్భంగా దోనీపై ప్రశ్నిస్తే.. ఒక్కడే దొరికాాడా అంటున్న లక్ష్మి

మెగాస్టార్, పవర్ స్టార్ లతో స్టెప్పులేసిన టాలీవుడ్ మెగా ఐటమ్ బాంబ్ రాయ్ లక్ష్మి తాజాగా బాలీవుడ్‌లో నటిస్తున్న చిత్రం "జూలీ 2". ఈ చిత్రంలో తన అందాలను పుష్కలంగా ఆరబోసిందీ టాలీవుడ్ రత్తాలు.జూలీ2 చిత్రం ప్రమోషన్‌లోభాగంగా ఆమెకు చాలా క్లిష్టమైన ప్రశ్నలు ఎదురవుతున్నాయి. వాటికి ఆమె ఓపిగ్గానే సమాధానమిస్తోంది.

 

కానీ, క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో అఫైర్ సాగించింది. ఇదే అంశంపై ప్రశ్నించగా ఆమె అంతెత్తున ఒంటికాలిపై లేస్తోంది. దీనిపై ఆమె స్పందిస్తూ.. తాను గతంలో మరో నలుగురైదుగురితో రిలేషన్ షిప్‌లో ఉన్నానని, వారు కూడా పేరు ప్రఖ్యాతులు ఉన్నవారేనని తెలిపింది. వారందర్నీ వదిలేసి, కేవలం ధోనీ పేరే ఎందుకు ఇంకా ప్రస్తావిస్తున్నారని ప్రశ్నించింది.

 

లక్ష్మీరాయ్ వ్యవహారం చూసి టాలీవుడ్, కోలీవుడ్ మీడియా అంతా షాక్ తింది. ఈ రెండు ఇండస్ట్రీల్లో ఇన్నేళ్లు ఉన్నప్పటికీ ఎఫైర్‌ల గురించి అస్సలు మాట్లాడని లక్ష్మీ రాయ్, బాలీవుడ్‌కి వెళ్లగానే ఎఫైర్‌ల గురించి మాట్లాడేస్తోంది. మొత్తానికి బాలీవుడ్‌ను బాగా ఆకళింపు చేసుకుందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

click me!