
నెల రోజులు ఇండస్ట్రీలో వరుసగా మరణవార్తలే వినాల్సి వస్తోంది. యంగ్ యాక్ట్రెస్, సింగర్, డాన్స్ మాస్టర్ చనిపోవడం సినీ లోకాన్ని కలవరపెడుతోంది. బెంగాలీ యాక్ట్రెస్ పల్లవి డే, బిదిషా డి మజుందార్, డాన్స్ మాస్టర్ టీనా సాధు, యువ నటి షహన ఆత్మహత్యలకు పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ నెల 11న ఢిల్లీకి చెందిన హర్యాన్వీ సింగర్ దివ్య ఇండోర్ అలియాస్ సంగీత కనిపించకుండా పోయింది. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పదకొండు రోజుల తర్వాత మే 22న రోహ్ తక్ సమీపంలో ఓ ఫ్లై ఓవర్ వద్ద పాతిపెట్టిన ఆమె డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు. బాడీకి పోస్ట్ మార్టం జరిపించి దివ్యగానే నిర్ధారించి, దర్యాప్తు చేపట్టారు.
ఈ కేసులో ముందుగా ఆమె స్నేహితులైన రవి, అనిల్ ను పోలీసులు అరెస్ట్ చేసి విచారించారు. ఈ క్రమంలో పచ్చి నిజాలు వెలుగులోకి వచ్చాయి. సంగీతకు మంచి స్నేహితులుగా ఉన్నవారే ప్లాన్ ప్రకారం హత్య చేశారని ఒప్పుకున్నారు. దీంతో సినీ రంగానికి చెందిన పలువురు షాక్ కు గురయ్యారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని హర్యాన్వీ గ్రూప్ వారు కూడా నివాళులు అర్పిస్తున్నారు. నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు.
పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. దివ్య హత్య ఘటనలో ప్రధాన సూత్రదారి రవిగా తేలింది. రవి ప్లాన్ ప్రకారం అనిల్ ను ఢిల్లీకి పంపించి సంగీతను ఓ మ్యూజిక్ ఆల్బమ్ పనిమీద కారులో తీసుకొని హర్యానాకు రమ్మన్నాడు. దారి మధ్యలో మొహం ప్రాంతం వైపు వెళ్తుండగా అనిల్ చెరుకు రసంలో 10 నిద్రమాత్రలు కలిపి దివ్యకు తాగించాడు. హర్యానాలోని కలనౌర్ కు సమీపంలో రవి కూడా వారిని కలిశాడు. ముగ్గురు దగ్గర్లోని ఓ దాబాలో భోజనం చేశారు. ఆ తర్వాత మళ్లీ ప్రయాణం ప్రారంభించగా.. కొద్దిసేపటికీ దివ్య అపస్మారక స్థితిలోకి వెళ్లింది. గుర్తించిన రవి వెంటనే ఆమె గొంతు నులిమి హ్యత చేశాడు. బాడీని ఫ్లైఓవర్ వద్ద పూడ్చి పెట్టారు. దివ్యకు వారిద్దరి మధ్య వచ్చిన కొన్ని మనస్పార్థాల వల్లే హత్య చేశారని పోలీసులు తెలుపుతున్నారు.
ఇదిలా ఉంటే దివ్య తల్లిదండ్రులు పోలీసులపైనా ఆరోపణలు చేస్తున్నారు. తమ కూతురు చావుకు పోలీసుల నిర్లక్ష్యమే కారణమంటూ మండిపడుతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. ఈ విషయంలో పోలీసులు స్పందిస్తూ నిందితులను అదుపులోకి తీసుకున్నామని, పూర్తి స్థాయి విచారణ తర్వాత కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.