Ayushmann Khurrana Comments: బాలీవుడ్ లో దమ్మున్న హీరోను నేనే, ఆయుష్మాన్ ఖురానా సంచలన వ్యాఖ్యలు

Published : May 27, 2022, 09:55 AM IST
Ayushmann Khurrana Comments: బాలీవుడ్ లో దమ్మున్న హీరోను నేనే,  ఆయుష్మాన్ ఖురానా  సంచలన వ్యాఖ్యలు

సారాంశం

బాలీవుడ్    యంగ్ హీరో  ఆయుష్మాన్ ఖురానా   సంచలన కామెంట్స్ చేశారు. బాలీవుడ్ లో తనే ధైర్యవంతుడినన్నట్టు మాట్లాడారు.ఇంతకీ ఆయుష్మాన్ ఏమన్నారు..? ఎందుకన్నారు..? 


బాలీవుడ్‌లో పాపులారిటీ ఉన్న యంగ్ హీరోలలో ఆయుష్మాన్ ఖురానా  ఒకరు. చాలా తక్కువ టైమ్ లోనే బాలీవుడ్  ప్రేక్షకుల మనసు దొచుకున్న ఈ హీరో.. సెలెక్టెడ్ సినిమాలతో.. మంచి సక్సెస్ రేటుతో దూసుకుపోతున్నాడు. సూజిత్ సర్కార్ దర్శకత్వం వహించిన  విక్కీ డోనర్ సినిమా తో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో... ఇందులో వీర్య  దాతగా వినూత్న పాత్రతో మెప్పించి...  మొదటి సినిమాతోనే ప్రత్యేక గుర్తింపు సాధించాడు. ఆతరువాత కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ లను సెలక్ట్ చేసుకుంటూ సినిమాలు చేస్తున్న ఈయంగ్ హీరో..కెరీర్ లో దూకుపోతున్నాడు. 

ఆయుష్మాన్ ఖురానా నటించిన తాజా మూవీ  అనేక్.  రిలీజ్ కు ముస్తాబుతున్న ఈసినిమా ప్రమోషన్లు స్టార్ట్ చేశారు టీమ్.  బిజీ బిజీగా ఈవెంట్లు.. ఇంటర్వ్యూలు చసుకుంటున్నాడు  ఆయుష్మాన్ ఖురానా. ఈ ప్రమోషన్లలో భాగంగా  జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆయుష్మాన్ కొన్ని ఇట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. మరికొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఇంతకీ ఆయుష్మాన్ ఏమన్నాడంటే. 

ఆయుష్మాన్ మాట్లాడుతూ..  నా సినిమా జీవితం గొప్ప ప్రయాణం. ప్రేక్షకులు నేను చేసిన ప్రయోగాలను ఆదరించారు. ఇది వారు మారుతున్నారు, కొత్త విషయాలను ఆదరిస్తారనే దానికి ఇది గొప్ప ఉదాహరణ. నేను ఈ స్థాయికి అంత సులభంగా రాలేదు. ఎన్నో రిస్కులు తీసుకున్నాను. ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాను. ఇవన్నీ చూసిన తర్వాత బాలీవుడ్‌లోని ధైర్యంగా ప్రయోగాలు చేసే హీరో  నేనొక్కడినే కావొచ్చని అనిపిస్తుంది అని  అన్నారు. 

సినిమా నటుడిగా, నిజమైన వ్యక్తిగా నాకు చాలా తేడా ఉంది. నిజ జీవితంలో నాకు ఎటువంటి బాధ లేదు. కానీ నటుడిగా ఎప్పుడూ ఘర్షణ పడుతూనే ఉంటా. నాలోని ఇద్దరు వ్యక్తులు ఎప్పుడూ గొడవ పడుతూ ఉంటారు అని అన్నాడు ఆయుష్మాన్. ఇక ఇప్పుడు ఆయుష్మాన్ ఖురానా అన్న మాటలు వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ లో ప్రయోగాలు చేసే నటులు చాలా మంది ఉన్నా... ఆయుష్మాన్ ఒక్కడే ధైర్యవంతుడా అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

వారణాసి లో మహేష్ బాబు తండ్రి పాత్రను మిస్సైన ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా?
Illu Illalu Pillalu Today Episode Dec 16: అమూల్య ప్రేమ వేషాలు కళ్లారా చూసిన పెద్దోడు, నాన్నకి చెప్పేందుకు సిద్ధం