విజయ్ తో సినిమాను పరుగులు పెట్టిస్తున్న వంశీ పైడిపల్లి, కీలక షెడ్యూల్ పూర్తి

Published : May 26, 2022, 09:55 PM IST
విజయ్ తో సినిమాను పరుగులు పెట్టిస్తున్న వంశీ పైడిపల్లి, కీలక షెడ్యూల్ పూర్తి

సారాంశం

దళపతి విజయ్ తో సినిమాను పరుగులు పెట్టిస్తున్నాడు టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి. ఈ మూవీ షూటింగ్ లో కీలక ఘట్టాన్ని కంప్లీట్ చేశారు టీమ్. సోషల్ మీడియాలో అనౌన్స్ చేవారు టీమ్. 

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్  హీరోగా.. టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి  దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా రూపొందుతోంది భారీ సినిమా.  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, పీవీపీ ,బ్యానర్లపై.. దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈమూవీకి  సంబంధించి కీలక షెడ్యూల్ పూర్తయినట్లుగా మేకర్స్ ప్రకటించారు. సినిమాలో ప్రధాన తారాగణంతో దాదాపుగా  25 రోజుల పాటు నాన్ స్టాప్ గా షూటింగ్ చేసి భారీ షెడ్యూల్‌ షూటింగ్‌ను పూర్తి చేశారు టీమ్. 

లాంగ్ షెడ్యూల్ కంప్లీట్ చేశామని.. ఈ షెడ్యూల్‌లో చాలా కీలక సన్నివేశాలు షూటింగ్ చేశామని  మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. విజయ్‌66 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈసినిమాలో హీరోయిన్‌గా నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తుంది. ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, శామ్, యోగి బాబు సంగీత, సంయుక్త లాంటి సీనియర్లు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ షెడ్యూల్‌ షూటింగ్‌లో వీరంతా పాల్గొన్నారు. 

 

చాలా మంది నటీనటులు సెట్స్‌కి వచ్చి షూట్‌లో పాల్గొనడంతో ప్రతిరోజూ ఒక పండగలా షూటింగ్ జరిగిందని మేకర్స్ తెలిపారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి వంశీ పైడిపల్లితో పాటు హరి, అహిషోర్‌ సాల్మన్‌ కథ, స్క్రీన్‌ప్లేను అందించారు. విజయ్ కెరీర్లో భారీ అంచనాలతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని 2023 సంక్రాంతి కానుగా  రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

విజయ్ దళపతి ఆడియన్స్ సహనాన్ని పరీక్షించబోతున్నాడా? జన నాయగన్ రన్ టైమ్ చూసి అభిమానులు షాక్
Motivational Dialogue: ఒక్కో డైలాగ్ ఒక్కో బుల్లెట్‌.. మ‌న‌సులో నుంచి పోవ‌డం క‌ష్టం