సూర్య టైటిల్ కు ఒటేయ్యండి!

Published : Dec 25, 2018, 08:49 PM IST
సూర్య టైటిల్ కు ఒటేయ్యండి!

సారాంశం

సూర్య 37వ సినిమాకు టైటిల్ సెలెక్ట్ చేయండి అంటూ దర్శకుడు కెవి.ఆనంద్ సోషల్ మీడియా ద్వారా అభిమానులను కోరాడు. 

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సినిమాలకు రాను రాను సౌత్ లో ఆదరణ పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా తెలుగులో అయితే స్టార్ హీరోల లెవెల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇకపోతే సూర్య 37వ సినిమాకు టైటిల్ సెలెక్ట్ చేయండి అంటూ దర్శకుడు కెవి.ఆనంద్ సోషల్ మీడియా ద్వారా అభిమానులను కోరాడు. 

మూడు టైటిల్స్ ను ఇచ్చి మీకు నచ్చిన టైటిల్ ను మీ హీరోకు ఇవ్వండి అంటూ హ్యాపీ క్రిస్టమస్ విషెష్ అందించాడు. దీంతో ఆ ట్వీట్ కు భారీ స్పందన వస్తోంది. మీట్ పాన్ కాపాన్ అలాగే ఉయిర్క అనే టైటిల్స్ ఇవ్వగా కోలీవుడ్ అభిమానులు మూడవ దానికే ఎక్కువగా ఓట్ వేస్తున్నారు. అయితే తెలుగులో కూడా ఆయనకు అభిమానులు ఉండడంతో మాకు కూడా అర్థమయ్యేలా ఓటు హక్కు ఇవ్వాలని కెవి ఆనంద్ ను ట్విట్టర్ లో కోరుతున్నారు. 

ఇక ఈ ప్రాజెక్టులో ఆర్య - మోహన్ లాల్ కూడా నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు హరీష్ జై రాజ్ సంగీతం అందించనున్నాడు. కెవి.ఆనంద్ - సూర్య కాంబినేషన్ లో ఇదివరకు వీడోక్కడే బ్రదర్ సినిమాలు తెరకెక్కాయి. 

PREV
click me!

Recommended Stories

డ్రింక్ తాగు, పార్టీ చేసుకో.. ప్రొటెక్షన్ మాత్రం మర్చిపోకు.! క్రేజీ హీరోయిన్‌కి తల్లి బోల్డ్ సలహా
2025 Missed Heroines: ఈ ఏడాది సిల్వర్ స్క్రీన్‌పై కనిపించని 8 మంది హీరోయిన్లు, 2026లో వీరిదే హవా