బన్నీకి ఫైనల్ గా ఓ కథను ఫిక్స్ చేసేశారు!

Published : Dec 25, 2018, 08:17 PM IST
బన్నీకి ఫైనల్ గా ఓ కథను ఫిక్స్ చేసేశారు!

సారాంశం

టాలీవుడ్ స్టార్ హీరోల్లో ప్రస్తుతం ఖాళీగా కనిపిస్తోన్న నటుడెవరో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంటే వెంటనే కథలను పట్టుకొచ్చే దర్శకులు చాలా మంది ఉన్నారు. 

టాలీవుడ్ స్టార్ హీరోల్లో ప్రస్తుతం ఖాళీగా కనిపిస్తోన్న నటుడెవరో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంటే వెంటనే కథలను పట్టుకొచ్చే దర్శకులు చాలా మంది ఉన్నారు. అయితే రోజుకో 10 కథలను వింటున్న బన్నీకి ఏ కాన్సెప్ట్ కూడా నచ్చడం లేదు. మొన్నటి వరకు త్రివిక్రమ్ అంటూ అనేక రకాల రూమర్స్ వచ్చాయి. 

వాటిపై ఇంతవరకు అల్లు ఫ్యామిలీ నుంచి గాని త్రివిక్రమ్ నుంచి గాని క్లారిటీ రాలేదు. ఇక ఫైనల్ గా ఇటీవల గీత ఆర్ట్స్ లోనే నెక్స్ట్ సినిమా చేస్తాను అని చెప్పిన పరశురామ్ లక్కీ ఛాన్స్ కొట్టేశాడని అర్ధమవుతోంది. ఈ ఏడాది గీత గోవిందం సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న పరశురామ్ నెక్స్ట్ మరో మంచి ఎంటర్టైనర్ కాన్సెప్ట్ తో రావాలని అనుకుంటున్నాడు. పరశురామ్ కొత్త కథ నచ్చడంతో అల్లు ఫ్యామిలీ బన్నీకి ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. 

అల్లు అర్జున్ కూడా దాదాపు ఒకే చేసి న్యూ లుక్ కోసం వర్కౌట్స్ చేస్తున్నట్లు సమాచారం. బన్నీ చివరగా నా పేరు సూర్య అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచి బన్నీ మార్కెట్ ను కూడా దెబ్బ కొట్టింది అందుకే కొంచెం ఆలస్యమయినా కూడా నెక్స్ట్ ప్రాజెక్ట్ తో మంచి హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. 

PREV
click me!

Recommended Stories

Illu Illalu Pillalu Today Episode Dec 11: పార్కులో విశ్వతో అమూల్య, చూసేసిన రామరాజు పెద్దకొడుకు
Karthika Deepam 2 Latest Episode: జ్యోకు గట్టిగా ఇచ్చిపడేసిన కార్తీక్- మనుమడిని మెచ్చుకున్న పారు