ఆ జాక్ స్పారో ఇక లేనట్లే!

Published : Dec 25, 2018, 07:50 PM ISTUpdated : Dec 25, 2018, 07:56 PM IST
ఆ జాక్ స్పారో ఇక లేనట్లే!

సారాంశం

హాలీవుడ్ బిగ్గెస్ట్ సిరీస్ లలో ది పైరేట్స్‌ ఆఫ్ ది కరేబియన్‌ ఒకటి. వరుసగా వరల్డ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తూ వస్తోన్న ఈ కాన్సెప్ట్ కు మంది ఆదరణ దక్కుతోంది. ఇక ఇప్పటికే 5 సిరీస్ లు రాగా మరో సిరీస్ త్వరలోనే మొదలుకాబోతోంది. 

హాలీవుడ్ బిగ్గెస్ట్ సిరీస్ లలో ది పైరేట్స్‌ ఆఫ్ ది కరేబియన్‌ ఒకటి. వరుసగా వరల్డ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తూ వస్తోన్న ఈ కాన్సెప్ట్ కు మంచి ఆదరణ దక్కుతోంది. ఇక ఇప్పటికే 5 సిరీస్ లు రాగా మరో సిరీస్ త్వరలోనే మొదలుకాబోతోంది. భారీ బడ్జెట్ తో ఇంటర్నేషనల్ లెవెల్లో సినిమాను తెరకెక్కించనున్నారు. సముద్ర దొంగలు వీరు అనే ట్యాగ్ తో తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ సిరీస్ లు పలకరించాయి. 

ఇకపోతే సినిమాలో ఎంతగానో ఆకట్టుకునే పాత్ర  జాక్‌స్పారో. ఆ క్యారెక్టర్ తో అలరించే హాలీవుడ్ సూపర్‌ స్టార్‌ జానీ డెప్‌ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే ఇక జాక్‌స్పారోగా అతను కనిపించడు. అతని స్థానంలో మరో ప్రముఖ హాలీవుడ్ నటుడు కనిపించనున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. 

కొత్త జాక్‌స్పారోగా నటించబోయే ఆ కొత్త నటుడు ఇంకా ఎవరనేది అధికారికంగా వెలువడలేదు కానీ గత 14 ఏళ్లుగా ఆ పాత్రతో అలరిస్తున్న జానీ డెప్‌ మాత్రం కనిపించడని చిత్ర నిర్మాణ సంస్థ మీడియాకు ప్రకటనను విడుదల చేసింది. అయితే అతను నటించకపోవడానికి గల కారణాన్ని కూడా నిర్మాతలు చెప్పలేదు. దీంతో సినిమాపై వస్తోన్న అనేక రూమర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.    

PREV
click me!

Recommended Stories

Amla Paul: కొడుకుతో క్యూట్ ఫోటోలని షేర్ చేసిన అమలాపాల్.. నెటిజన్ల విమర్శలు
అప్పటిదాకా అబ్బాయిల ఊసే లేదు..! హీరోయిన్ శ్రీలీల అంత మాట అనేసిందేంటి..