#Kushi : అట్లుంటది విజయ్ తోని...మస్తు షాక్ ఇచ్చాడే మళ్లీ

Published : Nov 09, 2022, 06:18 AM IST
#Kushi : అట్లుంటది విజయ్ తోని...మస్తు షాక్ ఇచ్చాడే మళ్లీ

సారాంశం

విజయ్‌ దేవరకొండ(Vijay Deverakonda) హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో సిద్ధమవుతోన్న యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఖుషి’(Kushi). ఈ చిత్రంలో విజయ్‌ సరసన సమంత(Samantha) నటిస్తోంది.


విజయ్ దేవరకొండ మొదటి సినిమాతోనే యూత్ లోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత అతని యాటిట్యూడ్ కి చాలా మంది ఫిదా అయ్యిపోయారు. ఒక్కో సినిమాకు తనేంటో ప్రూవ్ చేసుకుంటూ హిట్, ప్లాఫ్ లకు అతీతంగా తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నాడు. అయితే ఈ క్రమంలో కొన్ని ఎదురు దెబ్బలు తగిలాయి. విజయ్ పని అయ్యిపోయింది అన్నవాళ్లు ఉన్నారు.అయినా తగ్గేదేలే అన్నట్లు మళ్లీ తన సత్తా భాక్సాఫీస్ దగ్గర చూపిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా అతని తాజా చిత్రం ఖుషి ప్రి రిలీజ్ గురించిన ఓ వార్త మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

 భారీ అంచనాల మధ్య విడుదలైన 'లైగర్‌' (Liger) ప్రేక్షకులను మెప్పించలేకపోయిన సంగతి తెలిసిందే. మొదటి రోజు నుంచే నెగెటివ్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ చిత్రం అటు దర్శకుడు పూరి జగన్నాథ్‌, ఇటు జయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) కెరీర్‌లో బిగ్గెస్ట్‌ ఫ్లాప్‌ మూవీగా నిలిచింది. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్‌లో ఘనమైన ఎంట్రీ ఇద్దామనుకున్న విజయ్‌కు చేదు అనుభవాన్ని మిగిల్చింది.దాని ఇంపాక్ట్ అతని నెక్ట్స్ ఫిల్మ్ లు బిజినెస్ లపై పడుతుందని అందరూ భావించారు. కానీ అదేమీ అవ్వలేదు. ఇది చాలా మందికి మింగుడుపడని విషయమే. ట్రేడ్ కు షాకింగే.

ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ 'ఖుషి' చిత్రంలో నటిస్తున్నారు. సమంత హీరోయిన్. శివ నిర్వాణ దర్శకుడు. సామ్‌ అనారోగ్యం పాలవడంతో ఈ సినిమా షూటింగ్ తాత్కాలికంగా నిలిచింది. ఆమె కోలుకోగానే 'ఖుషి'ని పూర్తి చేస్తారు. మరోవైపు 'లైగర్‌'ఫ్లాప్‌ అయినా, 'ఖుషి' నాన్‌-థియేట్రికల్‌ రైట్స్‌ భారీ ధరకు అమ్ముడుపోయినట్లు టాలీవుడ్‌ ట్రేడ్ టాక్‌. హిందీతో కలిసి అన్ని భాషల్లో కలిపి దాదాపు రూ.90కోట్లకు అమ్ముడయమయ్యాయట. విజయ్‌, సామ్‌ కలిసి నటిస్తుండటం, శివ నిర్వాణ దర్శకుడు కావడంతోనే ఈ స్థాయి ట్రేడింగ్‌ జరిగిందని అంటున్నారు. అయితే లైగర్ వంటి డిజాస్టర్ వచ్చాక కూడా ఈ రేటు పలకటం అంటే మామూలు విషయం కాదనేది అభిమానులే కాదే సినీ సీనియర్స్ చేస్తున్న కామెంట్. ఇది విజయ్ దేవరకొండపై ట్రేడ్ కు ఉన్న నమ్మకం అంటున్నారు.

 ‘‘ఖుషి సినిమా షూటింగ్‌ 60శాతం పూర్తి అయింది. మొదట మేము ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించాం. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా విడుదల వచ్చే సంవత్సరానికి వాయిదా పడింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి(February 2023)లో ఈ చిత్రాన్ని మీ ముందుకు తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నాం’’ అని చెప్పాడు. 

ఇక  'లైగర్‌' పరాజయంతో పాటు, భవిష్యత్‌ ప్రణాళికలపైనా తన అభిప్రాయాన్ని చెప్పాడు. ఈ చిత్రం ఫ్లాప్‌ కారణంగా విరామమేమీ తీసుకోవాలన్న ఆలోచన లేదని విజయ్‌ తెలిపాడు. అంతేకాదు, ఎక్కడికి వెళ్లినా తన అభిమానులు అదిరిపోయే కమ్‌బ్యాక్‌తో రావాలని కోరుతున్నారని పేర్కొన్నాడు.

''నేను ఎక్కడికి వెళ్లినా నన్ను అభిమానులు అడిగితే ఒక్కటే 'అన్నా నువ్వు అదిరిపోయే చిత్రంతో మళ్లీ రావాలి' అని అంటున్నారు. వాళ్లకు నేను చెప్పే సమాధానం ఏంటో తెలుసా? 'నేను ఎక్కడికీ వెళ్లలేదు కదా' అని చెబుతా'' అంటూ విజయ్‌ దేవరకొండ చెప్పుకొచ్చారు. లైగర్‌ ఒక నటుడిగా, వ్యక్తిగా తానేంటో తనకు చూపించిందన్నారు. తానేం చేయగలనో కూడా తెలిసిందన్న విజయ్‌.. ఎంతో విలువైన పాఠాన్ని నేర్చుకున్నట్లు చెప్పారు.

PREV
click me!

Recommended Stories

Ustaad Bhagat Singh: ఊపేసేలా ఉన్న `దేఖ్‌ లేంగే సాలా` పాట.. మళ్లీ ఆ రోజులను గుర్తు చేసిన పవన్‌ కళ్యాణ్‌
అడివి శేష్ గూఢచారి 2 తో పాటు బోల్డ్ హీరోయిన్ నుంచి రాబోతున్న 5 సినిమాలు ఇవే