
బిగ్ బాస్ తెలుగు సీజన్ సిక్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. వారం వారం గడిచే కొద్ది టఫ్ గేమ్ స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా గీతు వెళ్లిపోయిన ఆరా నుంచి హౌస్ బయటకు వచ్చి.. నామినేషన్ల వేడితో.. హౌస్ అంతా మంటలుమండిపోయాయి.. ఇక అవి అలాగే మండుతూ.. అందరిమధ్య డిస్కర్షన్స్ నడుస్తున్న టైమ్ లో.. కెప్టెన్సీ టాక్స్ ను స్టార్ట్ చేశాడు బిగ్ బాస్. పాములు , నిచ్చెనల ఆట స్టార్ట్ అయ్యింది. బజర్ మోగగానే మట్టి కోసం పోటీపడటం.. అది తెచ్చుకుని పాములు, నిచ్చెనలు ఆర్ట్ వేయడం.. ఒకరిది ఒకరు చెడగొట్టడం.. ఇలా ఈసారి కూడా ఫిజికల్ గా ఇబ్బంది పడే టాస్క్ ఏ.. ఇచ్చాడు బిగ్ బాస్.
ఇక ఈ క్రమంలో వేలుకు దెబ్బ తగలడంతో.. కీర్తి ఆనటు ఆడలేకపోతుంది. కాస్త కూడా పెర్పామెన్స్ చూపించలేకపోవడంతో.. బోరున విలపించింది. లాస్ట్ వీక్ టాస్క్ తో పాటు.. ఈవీక్ టాస్క్ కూడా ఆడలేకపోయానంటూ బాధపడింది కీర్తి. అటు రేవంత్ ఈ టాస్క్ లో కూడా గట్టిగా పోటీఇస్తున్నాడు. మట్టిని తీసుకురావడంతో తానే మందు ఉంటున్నాడు. కొంత మందికి తన తరుపునుంచి మట్టిని తీసుకుని ఇస్తున్నాడు. ఇక ఒకరి దగ్గర నుంచి ఇంకొకరు మట్టి తీసుకునే క్రమంలో ఫైటింగ్ లుజరుగుతున్నాయి. ఈక్రమంలో ఇనయా. ఫైమా మధ్య గొడవ మాటల నుంచి తారాస్థాయికి చేరింది. ఒకరిపై మరొకరు ఫైటింగ్ చేసుకునేలా మారింది.
ఈ గేమ్ అంతా ఈ ఇద్దరి ఆటపైనే ఫోకస్ అయ్యేలా ఉంది. ముఖ్యంగా ఇనయాను ఫైమా తన మట్టి తీసుకోనీయకుండా ఉండుం పట్టు పట్టుకుని ఎలాగైనా తన మట్టిని కాపాడుకుంది. ఈక్రమంలో ఇనయా దేవంత్ కు దగ్గరవుతున్నట్టు కనిపించింది. గేమ్ లో ఇనయా మీద కాస్త ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు రేవంత్. గతంలో కలిసి టాక్స్ ఆడినచనువుతోనో ఏమో కాని.. ఇనయా గేమ్ నుంచి ఎలిమినేట్ అయినప్పుడు కూడా దగ్గరుండి ఓదార్చాడు రేవంత్.
మిగతావరాంతా ఎవరిగేమ్ వారు ఆడుతున్నారు. గేమ్ నుంచి వాసంతి, ఇనయా బయటకు వచ్చేశారు. అంతకు ముందు రోహిత్, శ్రీ సత్యలు కూడా ఎలిమినేట్అయ్యారు. కాని ఎలిమినేషన్ ను తట్టుకోలేకపోయిన ఇనయా మళ్ళీ తిండి తినకుండా.. బెడ్ రూమ్ లోకి వెళ్ళి ఏడుస్తూ కూర్చుంది. ఇక గేమ్ లో అంతో ఇంతో ప్రయత్నం చేసినవాళ్లలో బాలాదిత్య కూడా ఉన్నాడు. శ్రీహాన్ దగ్గర నుంచి మట్టి తీసుకోవడనికి చాలా ట్రై చేశాడు. టఫ్ ఇచ్చాడు. కాని ఎక్కువగా తీసుకోలేకపోయాడు.
రాజ్ కాని, రేవంత్ కాని, శ్రీహాన్ కాని.. వారి గేమ్ వారు పర్ఫెక్ట్ గా ఆడుతున్నారు. వాసంతి ఈసారి ఎక్కువ ఎఫర్ట్ పెట్టలేక ప్రస్టేషన్ చూపిస్తోంది. చివరిగా ఈ గేమ్ అయిపోయినట్టు ప్రకటించాడు బిగ్ బాస్. మరి ఈ బాగంలో విజేత ఎవరు అనేది మాత్రం చెప్పలేదు. రేపటి ఎపిసోడ్ లో కొత్త ఆట ఆడే అవకాశం ఉంది. ఇక ఈమధ్యలో నామినేషన్ల కు సంబంధించినడిస్కర్షన్స్ జరుగుతూనే ఉన్నాయి గ్రూపులుగా విడిపోయి ఎవరికి వారు మాట్లాడుకుంటున్నారు. ఇక ఆదిరెడ్డి మాత్రం ఎవరితో కలవకుండా.. తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. గీతు గురించి ఆలోచిస్తూ.. బాధపడుతున్నాడు.