
ఓవర్ నైట్ లో ఎవరూ గొప్పవాళ్లు అయ్యిపోరు. దానికి వెనక ఏళ్ల తరబడి ఎదురుచూపు, కష్టం ఉంటుంది. సక్సెస్ వచ్చాక అందరూ చూస్తారు..ఆఫర్స్ ఇస్తారు. ఇప్పుడు అదే జరుగుతోంది బింబిసార డైరక్టర్ కు. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రమే `బింబిసార`. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మితమైన ఈ చిత్రంలో కేథరిన్ థ్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సోషియో ఫ్యాంటసీ మూవీ తద్వారా మల్లాడి వశిష్ఠ్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు.
ఆగస్టు 5న వరల్డ్ వైడ్‌గా విడుదలైన ఈ చిత్రం.. మార్నింగ్ షో నుండే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. దాంతో సాయంత్రానికి థియేటర్ల దగ్గర రద్దీ పెరిగింది. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను బద్దలు కొట్టి.. లాభాల బాట పట్టింది. ప్రస్తుతం ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ను రాబడుతూ బీభీత్సం సృష్టించింది. దాంతో ఈ డైరక్టర్ తో సినిమా చేయాలని చాలా మంది హీరోలకు ఆసక్తి కలిగింది. రజనీకాంత్ సైతం పిలిచి కథ వినిపించుకున్నారు. ఆయన ఓకే అన్నారని, దిల్ రాజు ఆ సినిమా ప్రొడ్యూసర్ చేయనున్నారని సమాచారం. అలా స్టార్ ప్రొడ్యూసర్స్ అందరూ అతని వెనక పడుతున్నారు.
దిల్ రాజు, అల్లు అరవింద్, మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు వశిష్యకు అడ్వాన్స్ లు ఇచ్చారని వినికిడి. అయితే బింబిసార 2 కు అతను కళ్యాణ్ రామ్ తో కమిటై ఉన్నారు. అది ప్రారంభించేలోగా మరో ప్రాజెక్టు పట్టాలు ఎక్కే అవకాసం ఉంది. వశిష్టకు వస్తున్న ఆఫర్స్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. రామ్ చరణ్ సైతం వశిష్టతో ఓ ప్రాజెక్టు చేయటానికి ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది.యువి క్రియేషన్స్ వారు ఈ సినిమా ప్రొడ్యూస్ చేయనున్నారు. గీతా ఆర్ట్స్ సైతం ఓ పెద్ద హీరోతో వశిష్ట సినిమా ప్లాన్ చేస్తోంది. మరో ప్రక్క వేర్వేరు ఇండిడ్యువల్ ప్రొడ్యూసర్స్ చాలా మంది వశిష్టతో డిస్కస్ చేస్తున్నారు. త్వరలోనే అఫీషియల్ ప్రకటన వీటిల్లో ఓ ప్రాజెక్ట్ తో వచ్చే అవకాసం ఉంది.