
Kriti Sanon: బాలీవుడ్ హీరోయిన్లంతా పెళ్లికి చేసుకుని లైఫ్‌లో సెటిల్ అవుతున్నారు. మ్యారేజ్ లైఫ్‌ని, కుటుంబాన్ని చూసుకుంటూనే సినిమాలు చేస్తున్నారు. రెండింటిని బ్యలెన్స్ చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు మరో హీరోయిన్ పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు ఊపందుకున్నాయి. ప్రభాస్ హీరోయిన్ మ్యారేజ్ చేసుకోబోతుందట.
ప్రభాస్ తో ఇటీవల `ఆదిపురుష్`లో సీతగా నటించిన కృతి సనన్ పెళ్లికి సిద్ధమవుతున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. కబీర్ బహియా అనే నటుడితో ఆమె చాలా కాలంగా డేటింగ్‌లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరు కలిసి చాలా సార్లు కెమెరాలకు చిక్కారు. తాజాగా బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఉన్న వీడియో వైరల్ కావడంతో పెళ్లి రూమర్లు వ్యాపించాయి. ఢిల్లీ విమానాశ్రయంలో ఇద్దరూ కలిసి కనిపించారు. కృతి తన ముఖాన్ని క్యాప్, మాస్క్, సన్ గ్లాసెస్‌తో దాచుకుంది. కబీర్ నలుపు దుస్తులు ధరించి కృతి కంటే ముందు నడిచాడు.
వీడియో షేర్ చేసిన ఓ నెటిజన్, "త్వరలోనే కోడలవుతుందేమో... కృతి బాయ్‌ఫ్రెండ్ కబీర్ బహియాతో కనిపించింది. తల్లిదండ్రులను కలవడానికి ఢిల్లీ వచ్చారు` అని రాశారు. "రబ్ నే బనాదీ జోడీ", " , "త్వరలోనే పెళ్లి జరుగుతుంది", "త్వరలో పెళ్లి చేసుకుంటారని నాకు అనిపిస్తోంది" వంటి కామెంట్లు నెటిజన్ల నుంచి వచ్చాయి.
కృతి, కబీర్ ఇద్దరి తల్లిదండ్రులు ఢిల్లీలో నివసిస్తున్నారు. కబీర్ తల్లిదండ్రులను కలవడానికే కృతి ఢిల్లీ వెళ్ళిందని కథనాలు వచ్చాయి. 2025 చివరి నాటికి వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని ప్రచారం జరుగుతోంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. ఇటీవల హీరోయిన్లంతా మ్యారేజ్ చేసుకుంటున్న నేపథ్యంలో కృతి విషయంలోనూ రూమర్లు బలంగా వినిపిస్తున్నాయి.
లండన్‌కు చెందిన వ్యాపారవేత్త కబీర్ బహియా. కృతి పుట్టినరోజు సందర్భంగా ఇద్దరూ గ్రీస్‌లో కలిసి విహారయాత్ర చేసినప్పుడు వీరి ప్రేమాయణం వెలుగులోకి వచ్చింది. వీరి ఫోటోలు వైరల్ అయ్యాయి. క్రిస్మస్, నూతన సంవత్సరాన్ని కూడా కలిసి జరుపుకున్నారు. అనేక కార్యక్రమాల్లో కలిసి కనిపించారు. ఇటీవల బెంగళూరులో జరిగిన ఓ పెళ్లిలో కూడా కలిసి కనిపించారు.
కృతి నటించిన 'దో పత్తి' ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వంలో ధనుష్ సరసన నటిస్తున్న 'తేరే ఇష్క్ మే' సినిమా నవంబర్ 28, 2025న విడుదల కానుంది.
also read: చిరంజీవి సినిమా చేయాలనుకుంటున్న రూ.1200కోట్ల డైరెక్టర్ ఎవరో తెలుసా? కుదిరితే సంచలనమే!