దర్శన్‌ `డెవిల్‌` టీజర్‌ రివ్యూ.. ఫ్యాన్స్ కి ఫీస్ట్, ఛాలెంజింగ్‌ స్టార్‌ ఊరమాస్‌ కమ్‌ బ్యాక్‌

Published : Feb 16, 2025, 12:05 PM IST
దర్శన్‌ `డెవిల్‌` టీజర్‌ రివ్యూ.. ఫ్యాన్స్ కి ఫీస్ట్, ఛాలెంజింగ్‌ స్టార్‌ ఊరమాస్‌ కమ్‌ బ్యాక్‌

సారాంశం

కన్నడ ఛాలెంజింగ్‌ స్టార్‌ దర్శన్‌ తన పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్ కి అదిరిపోయే సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. తాను హీరోగా నటిస్తున్న `ది డెవిల్‌` టీజర్‌ ని విడుదల చేయగా, ఇది రచ్చ చేస్తుంది.   

కన్నడ ఛాలెంజింగ్‌ స్టార్‌ దర్శన్‌ ఆ మధ్య వివాదాలతో వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. కొంత కాలం జైలుకి కూడా వెళ్లారు. అభిమాని హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ఆయన జైలుకి వెళ్లాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఇప్పుడు అదిరిపోయే కమ్‌ బ్యాక్‌ అవుతున్నారు. తాజాగా ఆయన `ది డెవిల్‌` చిత్రంతో వస్తున్నారు. ఈ మూవీ టీజర్‌ తాజాగా విడుదలైంది. 

టీజర్‌ అదిరిపోయేలా ఉంది. ఓ పబ్‌లో దర్శన్‌ మాస్‌ ఎంట్రీ ఇచ్చారు. ప్రత్యర్థులను చితక్కొటే సీన్లతో ఈ టీజర్‌ సాగింది. తనదైన స్టయిల్‌లో దర్శన్‌ విలన్లకి చుక్కలు చూపించారు. పబ్‌లో అందాల భామల మధ్య ఈ సన్నివేశాలు చూపించడం అదిరిపోయింది. గ్లామర్‌, యాక్షన్‌ మేళవింపుగా టీజర్‌ సాగింది. ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అయితే ఇది దర్శన్‌ ఫ్యాన్స్ కి మాత్రం ఫీస్ట్ లా ఉంది. ఆయన ఇంట్రడక్షన్‌, ఎలివేషన్‌ వేరే లెవల్‌లో ఉందని చెప్పొచ్చు. 

నేడు ఫిబ్రవరి 16న ఛాలెంజింగ్‌ స్టార్‌ దర్శన్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా `ది డెవిల్‌` మూవీ టీజర్‌ని విడుదల చేశారు. ఇది ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. సినిమాపై అంచనాలను పెంచుతుంది. ఈ మూవీకి ప్రకాష్‌ వీర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అజనీష్‌ లోక్‌నాథ్‌ సంగీతం అందిస్తున్నారు. ఆయన మార్క్ బీజీఎం టీజర్‌లో హైలైట్‌గా నిలుస్తుంది. అదే సమయంలో కాస్త కొత్తగానూ ఉంది. సినిమాలోని ఎలివేషన్లకి కొదవలేదని చెప్పొచ్చు. శ్రీ జైమాత కాంబైన్స్ పతాకంపై జే జయమ్మ నిర్మించారు. 

దర్శన్‌ చివరగా 2023లో `కాటేర` సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. ఈ మాస్‌, యాక్షన్‌ కమర్షియల్‌ మూవీ పెద్ద హిట్‌ అయ్యింది. దర్శన్‌ని హీరోగా మరో మెట్టు ఎక్కించింది. ఈ మూవీ వందకోట్లకుపైగా వసూళ్లని రాబట్టింది.ఈ  సక్సెస్‌ ఆనందంలో ఉన్న సమయంలో దర్శన్‌ని వివాదాలు వెంటాడాయి. ఓ అభిమాని హత్యకేసులో ఆయన పేరుని ప్రధాన నిందితుడు అని వార్త వినిపించింది. ఈ కేసులో జైల్లో జీవితం గడిపి వచ్చిన దర్శన్‌.. ఇప్పుడు `ది డెవిల్‌`తో ఆడియెన్స్ ని అలరించేందుకు రెఈ అవుతుత్నారు. 

Read  more: ప్రభాస్‌ సినిమాకి మంచు విష్ణు ఆడిషన్‌, నెటిజన్ల ట్రోలింగ్‌, ఇవన్నీ అవసరమా?

ALSO READ: ఎన్టీఆర్‌ `మనదేశం` సినిమా నిర్మాత కృష్ణవేణి కన్నుమూత, ఆమె ఏజ్‌ ఎంతో తెలిస్తే షాక్‌
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Prabhas: దేశముదురు దెబ్బకి అడ్రస్ లేకుండా పోయిన ప్రభాస్ సినిమా..ఒకే ఏడాది బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్
Bigg Boss Telugu 9: అలాంటి వాళ్ళు కప్ గెలిచినట్లు చరిత్రలో లేదు, ఈసారి బిగ్ బాస్ టైటిల్ ఎవరిదంటే ?