Kriti Sanon : పెట్స్ తో ఎంజాయ్ చేసిన కృతి సనన్... తన ఆనందానికి హద్దులు లేవనేంతలా..

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 27, 2022, 03:03 PM IST
Kriti Sanon : పెట్స్ తో  ఎంజాయ్ చేసిన కృతి సనన్...  తన ఆనందానికి హద్దులు లేవనేంతలా..

సారాంశం

 బాలీవుడ్ బ్యూటీ  కృతి సనన్ సోషల్ మీడియాలో తన పెట్స్ తో ఆడుతున్న వీడియోను పోస్ట్ చేసి హల్ చల్ చేస్తోంది. వాటితో ఆడుకుంటూ సరదగా గడుపుతోంది. ఈ సందర్భంగా ఆమె చేసిన హంగమా అంతా ఇంతా కాదు. 

డైరెక్టర్ సుకుమార్,  సూపర్ స్టార్ మహేష్‌ కాంబినేషన్ లో వచ్చిన ‘వన్ నేనొక్కడినే’ మూవీతో తెలుగుప్రేక్షకులను పలకరించింది కృతి సనన్.  ఈ సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్నది. సోషల్ మీడియాలో నూ తెగ యాక్టివ్ గా ఉంటుంది కృతి.  
 
ప్రస్తుతం ప్రభాస్‌తో `ఆదిపురుష్‌`లో సీతగా నటిస్తున్న కృతి సనన్‌.. లేటెస్ట్ గా తన సోషల్ మీడియాలో పెట్స్ తో ఆడుకుంటున్న వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో తన రెండు బిచాన్ బ్రీడ్ కు చెందిన పెట్స్ ను ఆడిస్తూ కనిపిస్తోంది.  పెట్స్ తో సరదాగా గంతులెస్తూ వాటిని ఆడిస్తూ.. తానూ ఎంజాయ్ చేసింది. పెట్స్ ను ముద్దాడుతూ, ఎత్తుకుని లాలించిందీ బ్యూటీ. పెట్స్ ను ఆడిస్తూనే స్పోర్ట్ వేర్ లో తన బ్యూటీని కూడా నెటిజన్లకు అందించింది. 

అయితే తన పెట్ ఫోబ్ తను ఇద్దరు ట్విన్స్  లాగే ఉన్నారంటూ క్యాప్షన్ పెట్టింది. తన పెట్ కలర్ డ్రెస్ ధరించి తెగ అల్లరి చేసింది. సన్నని  జాజిమల్లెలా ఉండే కృతి  పెట్స్ తో ఆడుతూ సంతోషపడటం చూసిన నెటిజన్లు కూడా ఖుషీ అవుతున్నారు. తన ఆనందానికి అవధులే లేవన్న స్థాయిలో  ఎంజాయి చేసింది.   

 

తెలుగులో రెండు సినిమాల్లో మెరిసిన క్రితి సనన్ ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తోంది.  `బచ్చన్‌ పాండే`, `షేహజాడా`, `బేదియా`, `గణపత్‌` ‘ఆదిపురుష్’ చిత్రాల్లో నటిస్తోంది ఈ బ్యూటీ. వీటితోపాటు చాలా రోజుల తర్వాత తెలుగులోకి రీఎంట్రీ ఇస్తూ `ఆదిపురుష్‌` చిత్రంలో నటిస్తుంది. ఇందులో ఆమె సీత పాత్రలో కనిపిస్తుండటం విశేషం. ఈ  సినిమా ఆగస్ట్ 11న విడుదల కానుంది. 

PREV
click me!

Recommended Stories

500 కోట్ల ధురంధర్, స్టార్ హీరోలను కూడా భయపెడుతున్న రణ్ వీర్ సింగ్ సినిమా
రవితేజ సంచలన నిర్ణయం, మాస్ మహారాజా ట్యాగ్ ను దూరం పెట్టిన స్టార్ హీరో?