అక్కినేని యంగ్ హీరోతో వన్స్ మోర్ అంటున్న కృతి శెట్టి, వెల్కం చెప్పిన నాగచైతన్య టీమ్

By Mahesh JujjuriFirst Published Jun 23, 2022, 12:54 PM IST
Highlights

కెరీర్ బిగినింగ్ నుంచీ వరుస సినిమాలు.. తిరుగులేని సక్సెస్ లతో దూసుకుపోతోంది కృతీ శెట్టి. వరుస ఆఫర్లతో బిజీగా మారుతుంది. కృతీ శెట్టి కోసం క్యూ కడుతున్నారు  మేకర్స్. ఈ క్రమంలోనే ఆమె నాగచైతన్య జోడీగా మరోసారి మెరబోతోంది. 

కృతీ శెట్టి. అసలే ఆమె అందానికి అందం..అదృష్టానికి అదృష్ణం ఈరెండు తోడైతే ఎలా ఉంటుందో.. అలా ఉంటుంది స్టార్ బ్యూటీ.  ఇండస్ట్రీలోకి కృతీ అడుగు పెట్టిన వేళా విశేషం బాగుంది. ఒక సినిమా తరువాత ఒకటిగా సినిమాలు ఆమె గుమ్మం ముందుకు వచ్చి ఆగుతున్నాయి. 

కృతి శెట్టి అందగత్తె మాత్రమే కాదు .. అదృష్టవంతురాలు కూడా. తెలుగు తెరకి పరిచయమవుతూనే వరుస అవకాశాలను అందుకుంది .. చాలా తేలికగా హ్యాట్రిక్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇక ఇప్పుడు ఆమె నుంచి రావడానికి మూడు సినిమాలు రెడీ అవుతున్నాయి. 

ప్రస్తుతం కృతీ శెట్టి ఖాతాలో సుధీర్ బాబుతో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాతో పాటు రామ్ పోతీనేనితో ది వారియర్ .. నితిన్ తో మాచర్ల నియోజక వర్గం సినిమాలు చేస్తోంది మరికొన్ని సినిమాలు ప్రపోజలు స్టేజ్ లో ఉన్నాయి. ఇక ఈ మూడు సినిమాలు ఈ ఏడాదిలోనే రానుండటం విశేషం. ఈ నేపథ్యంలోనే ఆమె మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్  ఇచ్చేసింది. అది నాగచైతన్య సినిమా కావడం .. తెలుగు - తమిళ భాషల్లో రూపొందుతుండటం విశేషం. 

నాగచైతన్య హీరోగా వెంకట్ ప్రభు ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. కెరియర్ పరంగా చైతూకి ఇది 22వ సినిమా. శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో కథానాయికగా కృతి శెట్టిని తీసుకున్నారు. ఆ విషయాన్ని అధికారకంగా ప్రకటించారు. బంగార్రాజు తరువాత చైతూ .. కృతి కలుసు నటిస్తున్న సినిమా ఇది.

click me!