‘మురారి’వల్ల తనకు ఎంత లాభం వచ్చిందో చెప్పిన కృష్ణ వంశీ

By Surya PrakashFirst Published Jul 21, 2024, 4:31 PM IST
Highlights

క్రమంలో  దర్శకుడు కృష్ణవంశీ అభిమానులతో ముచ్చటిస్తున్నారు. అయితే కొందరు ఈ సినిమాని ప్లాఫ్ అన్నారు. దానికి ఆయన స్పందించి, తనకు ఎంత లాభం వచ్చిందో చెప్పుకొచ్చారు.
 

మహేష్ హీరోగా ప్రముఖ దర్శకుడు  కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌ బస్టర్‌ చిత్రం ‘మురారి’ (Muarai). సోనాలి బింద్రే హీరోయిన్. 2001 ఫిబ్రవరి 17న విడుదలైన ఈ సినిమా  బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.  ఈ చిత్రంకి  మణిశర్మ అందించిన పాటలు, నేపథ్య సంగీతం ఎవర్‌గ్రీన్‌ గా ఎక్కడో చోట వినపడుతూంటాయి. ఈ నేఫధ్యంలో  వచ్చేనెలలో (ఆగస్టు 9) మహేశ్‌బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని రీరిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో  దర్శకుడు కృష్ణవంశీ అభిమానులతో ముచ్చటిస్తున్నారు. అయితే కొందరు ఈ సినిమాని ప్లాఫ్ అన్నారు. దానికి ఆయన స్పందించి, తనకు ఎంత లాభం వచ్చిందో చెప్పుకొచ్చారు.

సోషల్ మీడియాలో ఓ వ్యక్తి... ‘మురారి ఫ్లాప్‌ మూవీ’ అంటూ కామెంట్ చేయటంతో  కృష్ణవంశీ తనదైన సమాధానం ఇచ్చారు. ‘‘హలో అండీ.. నేను మురారి నిర్మాత ఎన్‌.రామలింగేశ్వరరావుగారి నుంచి రూ.55లక్షలకు ఐదేళ్ల పాటు తూర్పుగోదావరి జిల్లా హక్కులను కొన్నాను. ఫస్ట్‌ రన్‌లో 1 కోటి 30 లక్షలు కలెక్షన్లు వచ్చాయి. ఒకవేళ వసూళ్లే ప్రాతిపదిక అయితే, సినిమా ఫ్లాఫ్‌ లేదా సూపర్‌హిట్‌ మీరే నిర్ణయించుకోండి సర్‌. ధన్యవాదాలు’ అని అన్నారు. 

Latest Videos

అంతేకాదు, ‘మురారి’ మూవీకి తెలుగు ప్రేక్షకులు చూపిన ఆదరాభిమానాలు ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. మహేశ్‌బాబు అమితంగా ఇష్టపడే చిత్రాల్లో ఇది కూడా ఒకటని తెలిపారు. కొందరు వ్యక్తులు నెగెటివ్‌ కామెంట్లు చేసినా, మనం సంయమనం పాటించాలంటూ మరో నెటిజన్‌కు సమాధానం ఇచ్చారు. ‘వాళ్ల బతుకులు అవి.. మన సంస్కారం ఇది. వాళ్లను క్షమించండి. వదిలేయండి. ఎవరినీ కించపరచవద్దు. అర్థం చేసుకుని దయతో మెలగండి’ అంటూ చెప్పుకొచ్చారు. పొరపాటున మనం బ్యాలెన్స్‌ కోల్పోతే వాళ్లు విజయం సాధించినట్లు అంటూ సమాధానం ఇచ్చారు.

click me!