సెంటిమెంట్.. అక్కడ సినిమా పెళ్లే తరువాత నిజమైంది..!

By AN TeluguFirst Published Jun 27, 2019, 7:36 AM IST
Highlights

తెలుగు చిత్రపరిశ్రమలో కృష్ణ-విజయనిర్మలల జంట ప్రత్యేకమనే చెప్పాలి.. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు

తెలుగు చిత్రపరిశ్రమలో కృష్ణ-విజయనిర్మలల జంట ప్రత్యేకమనే చెప్పాలి.. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఇద్దరూ కలిసి నటించిన తొలి సినిమాలో భార్యాభర్తలుగా నటించిన ఈ జంట నిజ జీవితంలో కూడా భార్యభర్తలయ్యారు.

విజయనిర్మల తొలిసారి కృష్ణని చూసింది ఆమె హీరోయిన్ గాపరిచయమైన 'రంగులరాట్నం' సెట్ లోనే.. ఆ సినిమా దర్శకుడితో మాట్లాడానికి కృష్ణ వచ్చేవారు. ఆ తరువాత  దర్శకుడు బాపు రూపొందించిన 'సాక్షి' సినిమాతో తొలిసారి కృష్ణ-విజయనిర్మల  స్క్రీన్ షేర్ చేసుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. 1967లో వచ్చిన 'సాక్షి' బాపు రూపొందించిన మొదటి సినిమా. ఈ సినిమా షూటింగ్ కోసం ముప్పై రోజులు అవుట్ డోర్ ప్లాన్ చేశారు. గోదావరి తీరంలోని పులిదిండి గ్రామంలో షూటింగ్ చేయాలనుకున్నారు. ఆ ఊళ్లో ఒక గుడి ఉంది. అందులో కృష్ణుడికి మీసాలు ఉంటాయి. అందుకే భక్తులు ఆయనను మీసాల కృష్ణుడు అంటుంటారు. అయితే 'సాక్షి' సినిమాలో నటించిన కమెడియన్ రాజబాబుకి ఆ దేవుడి మహిమ తెలుసు..

సినిమాలో ఒక పాట కోసం విజయనిర్మల, కృష్ణలను పెళ్లి బట్టల్లో అలంకరించి వారి కొంగులు ముడివేసి ఆ గుడిలోనే చిత్రీకరించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న రాజబాబు కొత్త దంపతుల దుస్తుల్లో ఉన్న కృష్ణ-విజయనిర్మలను చూసి 'ఇక్కడ  మీసాల కృష్ణుడు చాలా పవర్ ఫుల్' అంటూ చమత్కరించారట. ఆయన అన్న మాటే నిజమైంది. ఆ షూటింగ్ జరిగిన రెండేళ్లకే కృష్ణ-విజయనిర్మల పెళ్లి చేసుకున్నారు.  

ప్రముఖ సినీ నటి, దర్శకురాలు విజయనిర్మల కన్నుమూత

click me!