చెన్నై కరువుపై టైటానిక్ హీరో కామెంట్

Published : Jun 26, 2019, 08:46 PM ISTUpdated : Jun 26, 2019, 08:49 PM IST
చెన్నై కరువుపై టైటానిక్ హీరో కామెంట్

సారాంశం

చెన్నై నగరాన్ని కరువు సమస్య తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. త్రాగు నీటి కోసం జనాలు అల్లాడిపోవడం ప్రపంచాన్ని సైతం కదిలిస్తున్నట్లు అర్ధమవుతోంది. హాలీవుడ్ స్టార్ హీరోకు చెన్నై ప్రజల నీటి కష్టాలు తెలిశాయంటే కరువు ఏ రేంజ్ లో ఉందొ అర్ధం చేసుకోవచ్చు. 

 టైటానిక్ హీరో లియోనార్డో డి కాప్రియో తమిళ జనాల నీటి కష్టాలను చూసి సోషల్ మీడియాలో స్పందించాడు. నీటి కోసం బావి చుట్టూ జనాలు చేరినట్లు ఉన్న ఒక ఫోటోని పోస్ట్ చేసి ప్రపంచ వ్యాప్తంగా ఈ విషయాన్నీ తెలిసేలా చేశాడు. జనాలు పడుతున్న కష్టాలను సైతం తన ఇన్స్టాగ్రామ్ లో వివరంగా తెలిపాడు. 

ప్రధాన వనరులన్నీ ఎండిపోవడంతో తీవ్రంగా కరువు ఏర్పడిందంటూ చెన్నైని వర్షం మాత్రమే ఆదుకోవాలని అన్నారు. అలాగే వర్షాలు లేక చాలా వరకు ఆర్థిక వ్యాపారాలు కూడా తిన్నట్లు చెబుతూ వర్షం కోసం ప్రతి ఒక్కరు ప్రార్థిస్తున్నట్లు లియోనార్డో పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: చివరి రోజు ఓటింగ్‌ తలక్రిందులు, పక్కా ప్లాన్‌ ప్రకారమే.. టాప్‌లో ఉన్నదెవరంటే?
Karthika Deepam 2 Today Episode: దీప, కార్తీక్ లపై రెచ్చిపోయిన పారు, జ్యో- శ్రీధర్ పదవి పోయినట్లేనా?