
ఎపిసోడ్ ప్రారంభంలో ఆ ఫోటో ఎవరిది అని గౌతమ్ ని అడుగుతుంది కృష్ణ. అందుకు గౌతమ్ కోపంగా ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అంటాడు. ఏమన్నారు సార్ అని కృష్ణ అంటే నీ పని నువ్వు చూసుకో అంటాడు గౌతమ్. నాకు పని ఏమీ చెప్పలేదు కదా అని కృష్ణ అంటే ఇందాక ఇచ్చిన రిపోర్ట్స్ రెండూ రేపటికి రాసి తీసుకొని రా అంటాడు గౌతమ్. ఆ మాటలకి షాక్ అయినా కృష్ణ కంగారుగా సార్ అని అంటుంది. ఏం సరిపోవా ఇంకొకటి కావాలా అంటాడు గౌతమ్.
నా ప్రాణానికి ఇవి చాలు సార్ అంటుంది కృష్ణ. మళ్ళీ అతని క్యాబ్ కి వచ్చి పరిమళ మేడం మీకు సిస్టర్ అవుతారా మీలాగే తను కూడా ఎప్పుడు చిటపటలాడుతూ ఉంటుంది అంటుంది కృష్ణ. ఆ మాటలకి కోపగించుకున్న గౌతమ్ షటప్ అండ్ గెట్ అవుట్ అంటూ కోపంగా అరుస్తాడు. ఆ కోపానికి కంగారంగా బయటికి వచ్చిన కృష్ణ చూసుకోకుండా మురారిని గుద్దేస్తుంది. ఏంటి అంత కంగారు పడుతున్నావ్ అంటాడు మురారి.
డేంజర్ జోన్ లో ఉన్నాను అంటూ కంగారుగా అతనిని అక్కడి నుంచి లాక్కొని వెళ్ళిపోతుంది. కారులో వస్తున్న మురారి ఎందుకు కంగారుగా ఉన్నావో చెప్పలేదు అంటాడు మురారి. చెప్పి తీరాల అని కృష్ణ అంటే నాకు చెప్పకపోతే మరి ఎవరికి చెప్తావు అంటాడు మురారి. అడవిలో స్వేచ్ఛగా తిరిగే కుందేలు పిల్ల జనారణ్యం లోకి వస్తే ఎలాగ ఉక్కురిబిక్కిరి అవుతుందో అలాంటి పరిస్థితుల్లో ఉన్నాను నేను. ఇంట్లో పెద్ద అత్తయ్య హాస్పిటల్ లో పరిమళా మేడం సింహాల్లాగా గాండ్రిస్తారు ఇక మా సీనియర్ డాక్టర్ గౌతమ్ అయితే ఆయన పులి కాదు సింహం కాదు కనిపిస్తారు అంటుంది కృష్ణ.
అంటే అంటూ అర్థం కానట్లుగా మొహం పెడతాడు మురారి. కంఠంలో విషం దాచుకున్నట్లుగా ఎక్కువగా మాట్లాడరు, కోపం వస్తే మూడో కన్ను తెరుస్తారు. కానీ ఇంజక్షన్ పట్టుకుంటే త్రిశూలం పట్టుకున్నట్లే తిరుగులేని ఆయుధం అంటుంది కృష్ణ. నెత్తిన గంగ లాగా ఎవరూ లేరా అని నవ్వుతాడు మురారి. ఒక మనిషి గురించి మొదటిసారి ఎక్కువగా మాట్లాడుతున్నావు అంటాడు మురారి. వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్ పర్సన్, అయినా నాకు అర్థం కాని క్వశ్చన్ లాగా కనిపించారు అంటూ కార్ పక్కన ఆపమంటుంది కృష్ణ.
ఎందుకు ఆపమన్నావు అని మురారి అంటే స్టేషనరీ షాప్ లో కొన్ని వస్తువులు కొనుక్కోవాలి అంటూ షాప్ కి వెళ్లి తన కావాల్సిన కొనుక్కుంటుంది కృష్ణ. మరోవైపు నందు, కృష్ణ నాకు కావాలి తనని బయటకు పంపించేశారు ముందు అర్జెంట్గా తనని తీసుకురండి అంటూ, ముందు కృష్ణని తీసుకురండి అంటూ గొడవ పెడుతుంది. కృష్ణ మాత్రమే వదిన నేను కూడా నీకు వదిననే ఉంటుంది ముకుంద. నువ్వు నాతో ఆడుకోడానికి రమ్మంటే రావు తను నన్ను బాగా చూసుకుంటుంది అంటుంది నందు.
సరే కృష్ణ వచ్చిన వరకు ఆగుదాం అంటాడు నందు వాళ్ళ బాబాయ్. కృష్ణ డ్యూటీలో జాయిన్ అయింది కదా మావయ్య ప్రతిసారి తనే చూసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది కదా అంటుంది ముకుంద. అంతలోనే కృష్ణ వాళ్ళు రావడం చూసి ఆనంద పడిపోతుంది నందు. ఓన్లీ డ్రాపింగ్ లే అనుకున్నాను ఇప్పుడు పికప్ లు కూడా మొదలు పెట్టేవన్నమాట అనుకుంటుంది ముకుంద. కృష్ణ అంటూ ఆమెని వాటేసుకుంటుంది నందు.
నీకోసం చాక్లెట్ తీసుకొచ్చాను అంటూ నందుకు ఇస్తుంది కృష్ణ. నువ్వంటే నాకు అందుకే ఇష్టం నిన్ను ఇంట్లోంచి పంపించేసారేమో అని భయపడ్డాను అంటుంది నందు. కాఫీ ఇవ్వనా అని మురారిని వాళ్ళ పిన్ని అడుగుతుంది. వద్దు ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను అని వెళ్ళిపోతాడు మురారి. అప్పుడే అక్కడికి వచ్చిన భవాని ఇంటి పని, వంట పని అంతా వదిలేసి డ్యూటీ కి వెళ్ళిపోతావా అంటుంది. నేను మామూలుగా కూడా ఇంటి పని వంట పని ఎప్పుడు చేయలేదు కదా అంటుంది కృష్ణ. నిజమే నిన్ను అంత అపురూపంగా చూసుకుంటుంది మీ అత్త.
నీకు కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి. నీ తోటి కోడలు క్యారేజీ అందిస్తే కనీసం నీ పని కూడా నువ్వు చేసుకోవట్లేదు ఇంట్లో కుక్ రావట్లేదు అని తెలుసు కదా ఇంత పనీ ఎవరు చేస్తారనుకున్నావు అంటూ కోప్పడుతుంది భవాని నాకు ఎవరూ ఏమీ చెప్పలేదు అని కృష్ణ అంటే ఎవరు చెప్పరు నువ్వే తెలుసుకోవాలి. రేవతి ఒంట్లో బాగోలేదని పడుకుంటే ముకుందే ఇంటి పని వంట పని అంతా చేసింది. నువ్వు మాత్రం పెద్ద బిజీ డాక్టర్ వి అయిపోయినట్లుగా వెళ్లిపోయావు. మీ పనులైనా మీరు చేసుకోండి ఎగ్గొట్టాలని చూస్తే కుదరదు అంటుంది కృష్ణ.
హాస్పిటల్ కి వెళ్ళాలి కదా వచ్చేసరికి ఈ టైం అయింది అంటుంది కృష్ణ. ఈ ఇంటి కోడలుగా కొన్ని బాధ్యతలు ఉంటాయి అవి నెరవేర్చాకే బయటికి వెళ్ళాలి అంటుంది భవాని. నాకు ఇంతమందికి వండటం రాదు నాకు అంత టైం కూడా ఉండదు అంటుంది కృష్ణ. డ్యూటీలో జాయిన్ అయి ఒక్కరోజు కూడా కాలేదు అప్పుడే పద్ధతికి ఎదురు సమాధానం చెప్తావా, ఆవిడ ఏం ఆలోచించినా అందరు మంచి కోసమే ఆలోచిస్తారు. అలాంటి ఆవిడకి ఎదురు సమాధానం చెప్తావా అంటూ పుల్లమిరుపుగా మాట్లాడుతుంది ముకుంద.
నేను మాట్లాడుతున్నాను కదా మధ్యలో నువ్వెందుకు దూరిపోతున్నావు అంటుంది కృష్ణ. పొద్దున్న వెళ్లేటప్పుడు కూడా ఏమైనా హెల్ప్ కావాలని అడిగాను కదా అంటుంది. ఎప్పుడు అడిగావు హాస్పిటల్ కి వెళ్తున్నప్పుడు మురారితో కలిసి వచ్చినప్పుడు నేను బాక్స్ కట్టిచ్చిన తర్వాత అప్పుడు అడిగావు. అప్పుడు నిన్నాపి పని చెప్పాలా, ఇదేంటి అని అడిగితే పెద్దత్తయ్య మీదే ఎదురు తిరుగుతావా అంటుంది ముకుంద.
ఇందులో ఎదురు తిరిగే ప్రసక్తే లేదు తన ప్రాబ్లం తను చెప్తుంది అంటుంది సుమ. పెద్ద చిన్న చూడకుండా ముకుందతో వాదిస్తావేంటి?తను ఒక్కతే నీకు ఖాళీగా కనిపిస్తుందా పొద్దున్నే లేచి మీ అత్తకి మామకి కాఫీ ఇవ్వలేవా, టిఫిన్ చేసి పెట్టలేవా, మీ క్యారేజీ నువ్వు కట్టుకొని పోలేవా అంటుంది భవాని ఈరోజు వరకు నాకు అలా చేయమని ఎవరు చెప్పలేదు కదా, పిల్లలు ఆ అవసరం రాకుండా రేవతి అత్తయ్య చూసుకున్నారు. ఈరోజు నేను హాస్పిటల్ కి వెళ్ళటం మొదలు పెట్టుకుని ఈ ముకుందా విప్లవం తీసుకొస్తుందని అసలు ఊహించలేదు అంటుంది కృష్ణ.
ప్రేమగా బాక్స్ చేతిలో ఆనందపడ్డాను కానీ తిరిగి వచ్చేసరికి ఇలాగే ఉంటే తతంగం పెడుతుందని ఊహించలేదు అంటుంది కృష్ణ. ఏంటి నోరు లెగుస్తుంది ఒక మాట అంటే పడవా, అన్నదాంట్లో తప్పేముంది మీ ఇంట్లో ముగ్గురు కోడలు ఉన్నారు పని అంతా ఒక కోడల మీదే వదిలేస్తే కుదరదు. ఇది ఉమ్మడి కుటుంబం అందరూ సమానంగా పనిచేయాలి అంటుంది భవాని. రేపటి నుంచి ఇంటి పని వంట పని అంతా చేసే హాస్పిటల్ కి వెళ్తాను ఇలాంటి వాళ్ల చేత చెప్పించుకునే పరిస్థితి తీసుకురాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కృష్ణ.
ఎవరి పని వాళ్ళ చేయకపోతే నువ్వు నాకు చెప్పు అంటూ సుమకి పురమాయిస్తుంది భవాని. అత్తగారిని లేపి కూర్చోబెట్టి టాబ్లెట్స్ ఇస్తుంది కృష్ణ. మీరు మధ్యాహ్నం కూడా ఏమీ తినలేదు అన్నారు ఈ పాలు తాగకపోతే నేర్చుకుని పోతారు అంటూ బలవంతంగా ఆమె చేత పాలు తాగిస్తుంది. ఈరోజు అంతా నిన్ను చూడనే లేదు అంటుంది రేవతి. పొద్దున్నే హాస్పిటల్ కి వెళ్ళే ముందు నేను ఏసీపి సార్ వచ్చాము కానీ మీరు పడుకున్నారు లేపటం ఇష్టం లేక వెళ్ళిపోయాం అంటుంది కృష్ణ.
హాస్పిటల్ ఎలా ఉంది అని రేవతి అడిగితే ఇంట్లో పెద్ద అత్తయ్య ఎలాగో అక్కడ పరిమళా గారు అలాగ. ఆమె మనసు మంచిది అంటుంది రేవతి. మనసు మంచిదైతే ఏం చేసుకోవాలి? మడిచి సంచిలో పెట్టుకోవాలి ఎందుకు అరుస్తుందో తెలియదు కృష్ణ. మురారికి ఫ్రెండ్ కదా తనతో చెప్పించక పోయావా అంటుంది రేవతి అది కూడా అయింది ఫ్రెండ్ అయితే ఇంటికి వచ్చి భోంచేసి వెళ్ళు అంతేకానీ ఇలాంటివి కుదరదు అని అంటుంది, ఆవిడకి ఎవరైనా ఒకటే అంటుంది కృష్ణ. పోనీ వేరే హాస్పిటల్లో జాయిన్ అవుతావా అంటుంది రేవతి.
వద్దులెండి అక్కడికే వెళ్తాను అంటుంది కృష్ణ. ఈరోజు వంట ఎవరు చేశారు కానీ రేవతి అడిగితే ముకుంద చేసింది అంటుంది కృష్ణ మురారి కి క్యారేజ్ ఎవరు తీసుకెళ్లారు అని రేవతి అడుగుతుంది.నేను కూడా అదే అడిగితే అదంతా నీకెందుకు నేను చూసుకుంటాను అన్నాది అంటూ జరిగిందంతా చెప్తుంది కృష్ణ. మీ ఆరోగ్యం బాగోలేదు ఇవన్నీ నీకెందుకు అంటూ పాలు తాగి రెస్ట్ తీసుకోండి అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది కృష్ణ. మొన్నటి వరకు ఏమీ పట్టనట్లుగా ఉండే ముకుందా మొన్న వాలెంటైన్స్ డే నుంచి కొంచెం ఎక్కువ చేస్తుంది ఎందుకు అనుకుంటుంది రేవతి.
మరోవైపు కృష్ణని వెతుకుతుంటాడు మురారి. ఎదురుగుండా నన్ను పెట్టుకొని ఎవరిని వెతుకుతున్నావు అంటుంది ముకుంద కృష్ణ వెతుకుతున్నాను అంటాడు మురారి. నందుతో ఎక్కడో తొక్కుడు బిళ్ళ ఆడుతూ ఉండి ఉంటుంది అంటుంది ముకుంద అయితే చాలా మంచి పని చేస్తుంది అంటాడు మురారి. నీ పెళ్ళానికి ఈమధ్య నోరు ఎక్కువయింది నీ సొంత పెళ్ళాం అయిపోయినట్లుగా ఫీల్ అయిపోతుంది అంటుంది ముకుంద.
అందుకు మురారి ఆనందంగా అవునా అంటాడు అతని ఫీలింగ్ చూసి కోపంగా మొహం పెడుతుంది ముకుంద. తరువాయి భాగంలో కూరగాయలు కట్ చేయమని భర్తకి చెప్తుంది కృష్ణ. అతనికి చేతకాకపోవటంతో తనే దగ్గరుండి నేర్పిస్తుంది. అది చూసిన ముకుంద ఉడుక్కుంటుంది.