Prema Entha Madhuram: అనుమానంలో మాన్సీ.. కవల పిల్లలకు జన్మనివ్వనున్న అను.. హింట్ ఇచ్చిన ఆర్య?

Published : Mar 01, 2023, 01:09 PM IST
Prema Entha Madhuram: అనుమానంలో మాన్సీ.. కవల పిల్లలకు జన్మనివ్వనున్న అను.. హింట్ ఇచ్చిన ఆర్య?

సారాంశం

Prema Entha Madhuram: జీ తెలుగులో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకొని మంచి రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్ ప్రేమ ఎంత మధురం. ఈ సీరియల్ కథ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు మార్చి 1 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

ఎపిసోడ్ ప్రారంభంలో అను సీమంతానికి తయారైన తర్వాత ఆర్యతో అద్దంలో చూస్తూ నాకు అచ్చు మీలాంటి బాబు పుడతాడు అని అంటుంది. అప్పుడు ఆర్య, లేదు నాకు నీలాంటి డేరింగ్ అండ్ డాషింగ్ అమ్మాయే కావాలి అని అనగా.. ఆర్య ఒకవేళ అమ్మాయి అబ్బాయి ఇద్దరు పుడితే అని అంటాడు. మీ మాట పుణ్యమా అని అది జరిగితే అంతకన్నా ఆనందం ఇంకేం అంటుంది సార్ అని అంటుంది అను.

ఆ తర్వాత సీన్లో వర్ధన్ కుటుంబం అంతా కారులో వెళ్తూ ఉంటారు. ఇంతలో ఎక్కడికి వెళ్తున్నాము అని మాన్సీ అడగగా ఒక సైట్ కొన్నాను అది చూపించడానికి అందరినీ తీసుకువెళ్తున్నాను అని అంటాడు నీరజ్. ఇంతలో ఎందుకు మేడం గారు అలా ఉన్నారు అని జెండే, శారదమ్మ ని అడగగా, ఆర్య కూడా ఇలాగే ఏ స్థలం కొన్నా నన్ను తీసుకొని వెళ్లి చూపించేవాడు ఇప్పుడు ఎక్కడున్నాడో ఏంటో అని అంటుంది శారదమ్మ. 

కాసేపట్లోనే కలుస్తాం కదా అని నీరజ్ అనగా ఆశ్చర్యంగా చూస్తారు అందరూ. అదే దాదా త్వరలోనే కనిపిస్తాడు కనిపించాలని కోరుకుంటున్నాం కదా అని మాట మార్చేస్తాడు నీరజ్. ఇంతలో నీరజ్ కి ఫోన్ వస్తుంది. ఇక్కడ అన్ని పనులు అయిపోయాయి వాళ్ళిద్దరూ సీమంతానికి తయారవుతున్నారు త్వరగా రండి అని అంటాడు మేనేజర్. సరే అని ఆనందంగా ఫోన్ పెట్టేస్తాడు నీరజ్. ఇక్కడ ఏదో తేడాగా ఉంది అని మాన్సీ మనసులో అనుకుంటుంది. 

ఇంతలో అను, ఆర్యలు ఫోటోషూట్ కి తయారవుతారు. కెమెరామెన్ మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి నేను రాండంగా ఫోటోలు తీస్తూ ఉంటాను అని అంటాడు. ఏదో ఒకటి మాట్లాడు అని ఆర్య అనగా ఏం మాట్లాడాలి సార్ అని అను అంటుంది. ఇందాక నీకు మేకప్ చేసిన అమ్మాయి బాగుంది కదా అని ఆర్య అంటాడు. అప్పుడు ఆర్య పీక పట్టుకుంటుంది అను. దాన్ని ఫోటోగ్రాఫర్ ఫోటో తీస్తూ ఫోటో చాలా బాగున్నది మేడం అని అంటాడు. 

అలాగే వాళ్ళు మాట్లాడుకుంటుండగా కొన్ని ఫోటోలు తీస్తాడు మరికొన్ని ఫోటోలకు వాళ్ళిద్దరూ ఫోజులు ఇస్తారు. చాలా బాగున్నాయి సార్ ఫోటోలు అని అనగా చివర్లో ఐ లవ్ యు ఆర్య అని పలక మీద రాసి అను, ఆర్యకి ఇస్తుంది. లవ్ యు టూ అని ఆర్య అంటాడు. ఈ ఫోటో చాలా బాగుంది సార్ అని ఫోటోగ్రాఫర్ అంటాడు. అప్పుడు పక్కనే ఉన్న వాళ్ళందరూ ఎంత అన్యోన్యంగా ఉండే దంపతులను ఎక్కడా చూడలేదు సార్ అని ప్రశంసిస్తారు.

మరోవైపు కారులో ప్రాపర్టీ చూడడానికి తీసుకువెళ్తున్నాడు అంటే నాకు ఎందుకో నమ్మబుద్ధి కావట్లేదు అని అనుకుంటుంది మాన్సీ. ఇంతలో నీరజ్ మనసులో, వదినమ్మ సీమంతం బాగా జరుగుతుంది అనుకుంటున్నాను అని అనుకుంటాడు. మరోవైపు ఫోటోగ్రాఫర్ ఫొటోస్ బాగా వచ్చాయి సర్ అని అనగా ఇంక సీమంతంకి రెడీ అవ్వండి అని అంటారు పక్కన ఉన్నవాళ్లు.

ఇంతలో మేనేజర్ వాళ్ళు వచ్చి మీ కుటుంబం తరఫున ఎవరూ లేరా సార్? చిన్న కార్యక్రమము ఉన్నది అని అనగా లేరు, నా భార్యకి అమ్మయినా, నాన్న అయినా అన్ని నేనే ఆ కార్యక్రమం ఏదో నేనే చేస్తాను అని పసుపు తీసుకొని అను కాళ్లకు పసుపు రాసి పట్టీలు పెడతాడు. దానికి అను ఒకవైపు బాధపడుతూ ఉండగా ఇంకోవైపు ఆనందపడుతుంది తర్వాత ఇద్దరూ సీమంతం మండపానికి వెళ్తారు. కుర్చీలో కూర్చున్న అనుకి వాళ్ళ అమ్మానాన్నలు వస్తున్నట్లు అనిపిస్తుంది.

సర్ చూడండి అని అనగా అక్కడ ఎవరూ ఉండరు వాళ్లు దూరంగా ఉన్నా బానే ఉంటారు అను,వాళ్ల గురించి దిగులు పడి నువ్వు బాధపడొద్దు అని అంటాడు ఆర్య. అదే సమయంలో అక్కడికి వర్ధన్ కుటుంబం కారు వచ్చి ఆగుతుంది. నీరజ్ కిందకు దిగుతాడు ఇంతలోనే తన స్నేహితుడు ఒకడు కనిపిస్తాడు. నువ్వేంటి ఇక్కడున్నావు అని నీరజ్ అనగా మా బంధువుల పెళ్లి ఉంటే వచ్చాను. నువ్వెందుకు వచ్చావు మీ వదిన సీమంతానికా రెండో బ్లాక్లో జరుగుతుంది.. ఇందాకే ఫోటోలు తీసుకుంటుంటే చూశాను అని అంటాడు.

ఆ మాటలకు నీరజ్ ఆనందపడగా పక్కనే ఉన్న మాన్సీ, శారదమ్మ ఆశ్చర్యపోతారు. నిజంగా ఇక్కడే ఉన్నాడా అని ఆశగా అడుగుతుంది శారదమ్మ. ఇదంతా అనుకోకుండా జరుగుతుందా లేక కావాలనే జరుగుతుందా అని అనుకుంటుంది మాన్సీ. లోపలికి వెళ్లి చూసేసరికి అక్కడ అను, ఆర్యలు ఉంటారు. వర్ధన్ కుటుంబాన్ని చూసిన అను, ఆర్య కూడా ఆశ్చర్యపోతారు. ఆర్య అని వాళ్ళ అమ్మ పిలవగా అమ్మ అని వస్తాడు ఆర్య.

ఇన్ని రోజులు నీ పిలుపుని ఎంత మిస్ అయ్యాను రా అలా వదిలేసి వెళ్ళిపోయావు అమ్మ గుర్తుకు రాలేదా అని అంటది శారదమ్మ. దాదా నేనెప్పుడో అన్న మాటను ఇప్పటికీ నన్నే తప్ప పడుతున్నాడు. అప్పుడు ఏదో బుర్రలో ఉన్న చెత్త వాగేసాను అలాగని సీమంతానికి కూడా పిలవనంత కాని వాడిని అయిపోయాను అని అడగగా ఇది అనుకోకుండా జరిగిందిరా మేము ఏర్పాట్లు చేయలేదు అని ఆర్య అంటాడు.

అనుకోకుండా జరగడం ఏంటి బ్రో ఇన్ లా అని అంటుంది మాన్సీ . ఇంతలో మేనేజర్ అక్కడికి వచ్చి మేమే లక్కీ డ్రా తీయగా సార్ వాళ్ళు గెలిచారు అందుకే ఈ ఫంక్షన్ చేస్తున్నాము అని అంటాడు. అప్పుడు మాన్సీ , లక్కీ డ్రా లు గెలిస్తే గిఫ్ట్ లు ఇవ్వాలి కానీ ఫంక్షన్ చేయడం ఏంటి మీది ఏ షాపింగ్ మాల్ అని అడుగుతుంది. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?