మల్టీ ఆర్గాన్‌ ఫెయిల్యూర్స్.. కృష్ణ ఆరోగ్యంపై వైద్యుల వివరణ

Published : Nov 14, 2022, 06:46 PM IST
మల్టీ ఆర్గాన్‌ ఫెయిల్యూర్స్.. కృష్ణ ఆరోగ్యంపై వైద్యుల వివరణ

సారాంశం

కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై మరోసారి క్లారిటీ ఇచ్చారు కాంటినెంటల్‌ ఆసుపత్రి వైద్యులు. ఆయన ఇంకా క్రిటికల్‌ పొజిషియన్‌లోనే ఉన్నట్టు తెలిపారు. సోమవారం సాయంత్రం వాళ్లు మీడియాతో మాట్లాడారు.

సూపర్‌ స్టార్‌ కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై మరోసారి క్లారిటీ ఇచ్చారు కాంటినెంటల్‌ ఆసుపత్రి వైద్యులు. ఆయన ఇంకా క్రిటికల్‌ పొజిషియన్‌లోనే ఉన్నట్టు తెలిపారు. వెంటిలేటర్‌ పైనే చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఆయనకు మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్‌ కనిపిస్తుందని, కిడ్నీ, లివర్‌, లంగ్స్ దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. డయాలసిస్‌ చేస్తున్నామని, అంతేకాదు మెదడులోని కొంత డ్యామేజ్‌ని ఉందని వెల్లడించింది. కానీ మెదడు బాగానేపనిచేస్తుందని, కొంత శ్వాస కూడా తీసుకుంటున్నారని తెలిపారు. 

కృష్ణ ఆరోగ్యానికి మెరుగు పరిచేందుకు తాము చేయాల్సిందంతా చేస్తున్నామని, ఆయన ఆరోగ్యంలో మార్పులకు రెండు మూడు రోజులు పడుతుందని, అప్పటి వరకు సరైనా క్లారిటీ ఇవ్వలేమని, ప్రపంచ స్థాయి చికిత్స కృష్ణకి అందిస్తున్నామని పేర్కొన్నారు. ఎనిమిది డాక్టర్ల టీమ్‌ కృష్ణ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తుందని పేర్కొన్నారు. మరో 24గంటల్లో గానీ దీనిపై సమాధానం చెప్పలేమని పేర్కొన్నారు. ఆ తర్వాత నెక్ట్స్ దీనిపై స్పందించగలమని వెల్లడించారు. 

కృష్ణ రాత్రి రెండు గంటల సమయంలో అపస్మారక స్థితిలో కాంటినెంటల్‌ ఆసుపత్రికి చేరిన విషయం తెలిసిందే. కార్డియక్‌ అరెస్ట్ కారణంగా ఆయన ఆసుపత్రికి వచ్చారని, 20 నిమిషాలు శ్రమించి దాన్నుంచి బయటపడేలా చికిత్స అందించామని, ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని, ఆరోగ్యం నిలకడగానే ఉన్నా, పరిస్థితి మాత్రం క్రిటికల్‌గానే ఉందని మధ్యాహ్నం వైద్యులు తమ మీడియా సమావేశంలో తెలిపిన విషయం తెలిసిందే. 

ఈన అనారోగ్యం పరిస్థితి కారణంగా కృష్ణ ఫ్యామిలీ మొత్తం ఆసుపత్రిలోనే ఉన్నానని, నిమిషం నిమిషం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారని తెలుస్తుంది. మహేష్‌ బాబు, నమ్రత, మంజులా, నరేష్‌ ఇలా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ప్రస్తుతం ఆసుపత్రిలోనే ఉన్నారు. తెలుగు సినిమాపై తనదైన ముద్ర వేసుకున్న కృష్ణ అనారోగ్యానికి గురయ్యారనే వార్తతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ప్రత్యేక పూజలు చేస్తున్నారు. త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Manchu Manoj: రామ్‌ చరణ్‌, శింబులను దించుతున్న మంచు మనోజ్‌.. అదిరిపోయేలా `డేవిడ్‌ రెడ్డి` గ్లింప్స్
Rajasekhar: డాడీ అని పిలిచిన అమ్మాయితోనే రొమాన్స్ చేసిన రాజశేఖర్‌.. కట్‌ చేస్తే ఇండస్ట్రీ దున్నేసింది