ఆయనో ఫైటర్... ఖచ్చితంగా క్షేమంగా తిరిగొస్తారు : కృష్ణ ఆరోగ్యంపై నరేశ్

Siva Kodati |  
Published : Nov 14, 2022, 06:33 PM ISTUpdated : Nov 14, 2022, 06:36 PM IST
ఆయనో ఫైటర్... ఖచ్చితంగా క్షేమంగా తిరిగొస్తారు : కృష్ణ ఆరోగ్యంపై నరేశ్

సారాంశం

సూపర్‌స్టార్ కృష్ణ ఆరోగ్యంపై స్పందించారు సినీనటుడు నరేశ్. అభిమానులంతా దేవుడిని ప్రార్థించాలని.. రేపు మరో హెల్త్ బులిటిన్ ఆసుపత్రి వాళ్లే ఇస్తారని నరేశ్ పేర్కొన్నారు. కృష్ణకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవన్నారు. 

సూపర్‌స్టార్ కృష్ణ ఆరోగ్యం నిలకడగానే వుందన్నారు సినీనటుడు నరేశ్. హైదరాబాద్ కాంటినెంటల్ ఆసుపత్రి వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. క్రిటికల్‌గానే వున్నా శ్వాస తీసుకుంటున్నారని చెప్పారు. రేపు ఇంకా బాగుంటుందని నరేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు. రీల్ లైఫ్‌లో, రియల్ లైఫ్‌లో ఆయన డేరింగ్ అండ్ డ్యాషింగ్ అని.. కృష్ణకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని నరేశ్ తెలిపారు. ఆయన ఓ ఫైటర్ అన్న ఆయన.. దీని నుంచి బయటకు వస్తారని నమ్ముతున్నామన్నారు. అభిమానులంతా దేవుడిని ప్రార్థించాలని.. రేపు మరో హెల్త్ బులిటిన్ ఆసుపత్రి వాళ్లే ఇస్తారని నరేశ్ పేర్కొన్నారు. 48 గంటలు గడవాలని వైద్యులు చెబుతున్నారని.. వయసు రీత్యా కృష్ణకు కొన్ని సమస్యలు వచ్చాయని ఆయన తెలిపారు. 

ALso REad:వెంటిలేటర్ పై సూపర్ స్టార్ కృష్ణ... విషమంగా ఆరోగ్యం..!

కానీ... వైద్యులు చెప్పిన మాటలు మాత్రం కృష్ణ అభిమానుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నామని మధ్యాహ్నం తెలిపారు. శరీరం సహకరించకపోవచ్చు.. 48 గంటలు దాటితేనే ఏమైనా చెప్పగలం అంటున్నారు. ఆయన కోలుకోవాలని అభిమానులు ప్రార్థించాలని డాక్టర్లు చెప్పడంతో మరింత ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు వెంటిలేటర్ పైనే కృష్ణ చికిత్స పొందుతుండటంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని అర్థమవుతుందని అంటున్నారు. ఇక సినీ ప్రముఖులు కూడా ఆస్పత్రికి వచ్చి కృష్ణ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని వెళ్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Yogibabu బ్రహ్మానందం కలిసి వస్తే.. నవ్వులు సునామీ వచ్చేది ఎప్పుడంటే?
Manchu Manoj: రామ్‌ చరణ్‌, శింబులను దించుతున్న మంచు మనోజ్‌.. అదిరిపోయేలా `డేవిడ్‌ రెడ్డి` గ్లింప్స్