అందుకే కేసీఆర్ ను మరోసారి గెలిపించారు: సూపర్ స్టార్ కృష్ణ

Published : Dec 11, 2018, 03:22 PM IST
అందుకే కేసీఆర్ ను మరోసారి గెలిపించారు: సూపర్ స్టార్ కృష్ణ

సారాంశం

ప్రచారాల నుంచి ఓటింగ్ దశ వరకు అలాగే కౌంటింగ్ స్టార్ట్ కానుందన్న కొన్ని నిమిషాల ముందు వరకు తెలంగాణ ఎన్నికల్లో విజయం ఎవరిది అనేది ఎవరు అంచనా వేయలేకపోయారు. ఎగ్జిట్ పోల్స్ తప్పని చాలా కామెంట్స్ వచ్చాయి. ఇక ఫైనల్ గా మంచి మెజారిటీతో టీఆరెస్ రెండవసారి విజయం దక్కించుకుంది. 

ఇకపోతే సీనియర్ టాలీవుడ్ హీరో ఘట్టమనేని కృష్ణ కేసీఆర్ కు అభినందనలు తెలియజేస్తూ 'ప్రకటనను విడుదల చేశారు. ‘నాలుగున్నరేళ్ల కలం పరిపాలన తర్వాత ఇంత అత్యధిక స్థానాలలో విజయం సాధించి మళ్లీ అధికారంలోకి రావడం చాలా గొప్ప విషయం. కేసీఆర్‌ గారు ప్రవేశ పెట్టిన పథకాలన్నీ ప్రజలకి ఎంతో మేలు చేశాయి. అందుకే అన్ని వర్గాల ప్రజలు ఆయనకి ఈ అఖండ విజయాన్ని అందించారు. 

మళ్లీ రెండోసారి తెలంగాణకి ముఖ్యమంత్రిగా బాధ్యతల చేపడుతున్న కె. చంద్రశేఖర్‌రావు గారికి నా హృదయపూర్వక అభినందనలు’ అని కృష్ణ ప్రకటనలో పేర్కొన్నారు. ఇక గత ఏడాది గజ్వేల్ నియోజకవర్గంలో 19,366 ఓట్లతో విజయాన్ని దక్కించుకొని విజయాన్ని అందుకున్న కేసీఆర్ ఈ సారి అంతకంటే ఎక్కువగా 50 వేలకు పైగా మెజారిటీని అందుకోవడం స్పెషల్.  

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: కళ్యాణ్ ని తనూజ నిజంగా లవ్ చేస్తోందా ? సంతోషం పట్టలేక మ్యాటర్ బయటపెట్టేసిందిగా
భార్యతో విడాకుల రూమర్స్ ? స్టార్ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్ వైరల్