Pawan Kalyan: పవన్ కు స్క్రిప్ట్ చదివి వినిపిస్తున్న డైరెక్టర్ క్రిష్.. షూటింగ్ ఎప్పుడో..?

Published : Dec 20, 2021, 05:18 PM ISTUpdated : Dec 20, 2021, 05:22 PM IST
Pawan Kalyan: పవన్ కు స్క్రిప్ట్ చదివి వినిపిస్తున్న డైరెక్టర్ క్రిష్.. షూటింగ్ ఎప్పుడో..?

సారాంశం

పవర్ స్టార్ పవన్ కళ్యాన్ నెక్ట్స్ మూవీ షూటింగ్ కు రెడీ అవుతున్నారు. భీమ్లా నాయక్ షూటింగ్ అయిపోతుండటంతో.. హరిహరవీరమల్లు కోసం స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు. డైరెక్టర్ క్రిష్ తో కలిసి స్క్రిప్ట్ సెషన్స్ లో బిజీ అయిపోయారు పవర్ స్టార్.

 

పవర్ స్టార్ పవన్ కళ్యాన్ (Pawan Kalyan) సినిమాల విషయంలో సూపర్ స్పీడ్ చూపిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో  "వకీల్ సాబ్" సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan). ఇప్పుడు "అయ్యప్పనుమ్ కోషియుమ్" అనే మలయాళ మూవీ  రీమేక్ గా తెరకెక్కుతున్న.. "భీమ్లా నాయక్" సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తో పాటు మరో రెండు సినిమాలు సెట్స్ ఎక్కించి ఉన్నాడు పవన్. మరో రెండు సినిమాలు సెట్స్ ఎక్కడానికి రెడీగా ఉన్నాయి.

 

భీమ్లా నాయక్ తరువాత తర్వాత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)  క్రిష్(Krish) దర్శకత్వంలో "హరిహర వీరమల్లు"( Harihara Veeramallu) అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 40 శాతం పైగా  పూర్తి అయిపోయింది.  ఈ విషయం చాలా సందర్భాల్లో క్రిష్ చెప్పారు. కానీ కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. ఇక భీమ్లా నాయక్ షూటింగ్ చివరి దశలో ఉండటంతో.. వెంటనే పవన్ హరిహర వీరమల్లు సెట్స్  లో జాయిన్ అవుతారని తెలుస్తోంది.

 

దీనికి సంబంధించి పనులు కూడా స్టార్ట్ అయిపోయాయి. రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాన్ తో కలిసి హరిహర వీరమల్లు స్క్రిప్ట్ వర్క్ చేశాడు క్రిష్. పవన్ కు స్క్రిప్ట్ ను చదివి వినిపించాడు. దీనికి సంబంధించిన ఫోటోను ట్విట్టర్ లో శేర్ చేశారు క్రిష్. హరిహరవీరమల్లుతో  సీరియస్ గా స్క్రిప్ట్ సెషన్  నడుస్తుంది అంటూ.. డైరెక్టర్ పోస్ట్ పెట్టారు. దీన్ని బట్టి చూస్తే.. హరిహరమీరమల్లు షూటింగ్ షెడ్యూల్ త్వరలోనే స్టార్ట్ కాబోతున్నట్టు తెలుస్తోంది.


ఇప్పటికీ చార్మినార్ మరియు మచిలీపట్నం పోర్ట్ వద్ద కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ ను తెరకెక్కించారు టీమ్. కరోనా కేసులు ఉన్నట్లుండి ఎక్కువ అవడంతో షూటింగ్ ఆపేయాల్సి వచ్చింది. ఇప్పుడు అంతా క్లియర్ అయ్యింది పవన్ కూడా భీమ్లా నాయక్ కంప్లీట్ చేసి రాబోతున్నారు. ఇక హరిహరవీరమల్లు షూటింగ్ ప్రశాంతంగా జరుపుకోవాలి అని ప్లాన్ చేస్తున్నాడు క్రిష్. ఈ షెడ్యూల్ లో సినిమా ఫస్ట్ హాఫ్ షూటింగ్ ని కంప్లీట్ చేసే అవకాశం ఉంది.

 

Also Read:  Payal Item Song : రవితేజతో రచ్చ రచ్చ చేయబోతున్న పాయల్ రాజ్ పుత్

 

 పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న హరిహరవీరమల్లు.. ఫిక్షన్ స్టోరీతో.. ఒళ్లు గగుడ్పొడిచే పోరాట సన్నివేశాలతో తెరకెక్కబోతుంది. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ సరసన హీరోయిన్లు గా నిధి అగర్వాల్ మరియు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటిస్తున్నారు. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో మెగా సూర్య ప్రొడక్షన్స్ పై దయాకర్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?