RRR ముంబై ఈవెంట్ వెనుక ఇంత స్ట్రాటజీ ఉందా.. జక్కన్నా మజాకా!

By team teluguFirst Published Dec 20, 2021, 5:02 PM IST
Highlights

రాజమౌళి సినిమాని అద్భుతంగా తెరక్కించడం మాత్రమే కాదు.. ఆ చిత్రాన్ని ఎలా మార్కెట్ చేసుకోవాలి అనే విషయంలో కూడా పక్కా ప్లాన్ తో ఉంటాడు. బాహుబలి చిత్రానికి మించేలా ఆర్ఆర్ఆర్ విషయంలో రాజమౌళి మార్కెటింగ్ స్ట్రాటజీస్ అమలు చేస్తున్నాడు. 

రాజమౌళి సినిమాని అద్భుతంగా తెరక్కించడం మాత్రమే కాదు.. ఆ చిత్రాన్ని ఎలా మార్కెట్ చేసుకోవాలి అనే విషయంలో కూడా పక్కా ప్లాన్ తో ఉంటాడు. బాహుబలి చిత్రానికి మించేలా ఆర్ఆర్ఆర్ విషయంలో రాజమౌళి మార్కెటింగ్ స్ట్రాటజీస్ అమలు చేస్తున్నాడు. ఆదివారం రోజు ముంబై వేదికగా ఆర్ఆర్ఆర్ భారీ ఈవెంట్ నిర్వహించారు. ముంబైలో ఈ ఈవెంట్ నిర్వహించడం వెనుక పెద్ద ప్లాన్ ఉంది. 

ముందుగా RRR ఈవెంట్ దుబాయ్ లో అంటూ వార్తలు వచ్చాయి. కానీ ముంబైలో నిర్వహించారు. దీని వెనుక ఉద్దేశం హిందీ ఆడియన్స్ లో ఆర్ఆర్ఆర్ చిత్రంపై మరింత బజ్ పెంచడమే. యాక్షన్ ఎలిమెంట్స్ ఉండే తెలుగు డబ్బింగ్ చిత్రాలకు హిందీలో మంచి డిమాండ్ ఉంది. సాహో చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్లు రాబట్టింది. ఇక అల్లు అర్జున్ డీజే, రామ్ ఇస్మార్ట్ శంకర్ లాంటి చిత్రాలు హిందీలో డబ్ అయి వందల మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించాయి. 

దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు.. తెలుగు యాక్షన్ చిత్రాలకు హిందీలో ఎంతటి క్రేజ్ ఉందో అని. ఈవెంట్ కోసం చరణ్, ఎన్టీఆర్ అభిమానులని బస్సుల్లో, రైళ్లలో తరలించాడు జక్కన్న. రాంచరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ ఎంత పెద్ద స్టార్లో హిందీ వాళ్లకు తెలియడం కోసమే ఇలా చేశాడు. తెలుగు రాష్ట్రలో ప్రీ రిలీజ్ వేడుకలు, మూవీ ఈవెంట్స్ నిర్వహించినప్పుడు చరణ్, ఎన్టీఆర్, పవన్,బన్నీ లాంటి స్టార్ హీరోల ఫ్యాన్స్ ఏ రేంజ్ లో రచ్చ చేస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ హంగామా మొత్తం ముంబై ఈవెంట్ లో ఉండేలా చూసుకున్నాడు జక్కన్న. 

ఇదంతా హిందీ ఆడియన్స్ లో ఆసక్తి పెంచడానికి ఉపయోగపడుతుంది. తెలుగులో మాదిరి హిందీలో వీరాభిమానులు ఉండరు. హిందీ ఆడియన్స్ కి సినిమాకు ముందే చరణ్, ఎన్టీఆర్ కనెక్ట్ అయ్యేలా చేయడం కోసం వేసిన ప్లాన్ ఇది. 

తెలివిగా ఈవెంట్ ని లైవ్ టెలికాస్ట్ చేయలేదు. ఓ పెద్ద ఛానల్ లో ఈ ఈవెంట్ ని సందర్భానుసారం రెండు భాగాలుగా టెలికాస్ట్ చేయనున్నారట. ఈవెంట్ కు నార్త్ బిగ్ స్టార్ సల్మాన్ ఖాన్ హాజరయ్యాడు కాబట్టి అతడి కోసం అయినా ప్రతి ఇంట్లో ఈ ఈవెంట్ ని చూస్తారు. తద్వారా ఆర్ఆర్ఆర్ పై తెలియకుండానే ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా బజ్ పెరుగుతుంది. RoarOfRRRInMumbai ఈవెంట్ వెనుక ఉన్న జక్కన్న మాస్టర్ ప్లాన్ ఇదే. 

Also Read: Varshini: టైట్ ఫిట్ డ్రెస్ లో ఒంపుల వయ్యారం.. కసి చూపులతో టెంపరేచర్ పెంచేస్తున్న వర్షిణి

Also Read: పులి కసిగా పరిగెడితే ఎలా ఉంటుందో తెలుసా.. చరణ్, ఎన్టీఆర్ మధ్య తేడా అదే, అంచనాలు పెంచేసిన జక్కన్న

click me!