
ఆ తరువాత తమ బ్యానర్ లో ఓ చిన్న సినిమా చేయాలని, తన అసిస్టెంట్ లో ఒకరికి చాన్స్ ఇవ్వాలని అనుకున్నాడు. పైగా క్రిష్ చేతిలో రెండు హిందీ సినిమాలు వున్నాయి. అవి చేయాల్సిన ఒప్పందం వుంది. అయితే ఈలోగా ఓ మాంచి చాన్స్ తలుపు తట్టింది. క్రిష్ వెళ్లి మీలో ఎవరు కోటీశ్వరుడు షూట్ గ్యాప్ లో మెగాస్టార్ చిరంజీవి ని కలిసి ఓ స్క్రిప్ట్ నెరేట్ చేసారు.
దానికి ఏవో మార్పులు చేర్పులు చెప్పారు మెగాస్టార్. ఇప్పుడు ఆ పనిలో వున్నారు క్రిష్. మరి ఈ కథ చిరు కోసమో? చరణ్ కోసమో తెలియాల్సి వుంది. ఈలోగా కళ్యాణ్ రామ్ పేరు లాగేసారు క్రిష్ కు ముడిపెడుతూ. నిజానికి కళ్యాణ్ రామ్ ను క్రిష్ కలిసిందీ లేదు, మాట్లాడిందీ లేదు, కథ చెప్పిందీ లేదు.