
కమల్ హాసన్ చిన్న కూతురు అక్షర హాసన్ ఇంకా శృతీ హాసన్ అంత ఫేమస్ కాలేదు. అయితే గ్లామర్ విషయంలో మాత్రం అక్షర కూడా ఏం తక్కువ కాదు. తను చిన్ననాటి ఓ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పింది అక్షర.
మా నాన్నే నాకు గుండు కొట్టాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది అక్షర హాసన్ . అయితే గుండు కొట్టింది ఇప్పుడు కాదట ! అక్షర హాసన్ కు ఏడేళ్ల వయసులో గుండు కొట్టాడట ! అది కూడా అక్షర హాసన్ గుండు కొట్టిన్చుకోవాలని ఉందని తండ్రి కమల్ కు చెప్పడంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే అక్షర ని బాత్ రూమ్ లోకి తీసుకెళ్లి తానే స్వయంగా గుండు కొట్టాడట.
అక్షర సినిమాల్లోకి వచ్చింది కానీ అక్క శృతి హాసన్ లాగా సక్సెస్ కాలేకపోయింది . నాకు గుండు తో ఉండే రోల్ ఇవ్వండి సంతోషంగా చేస్తాను అని ఓపెన్ అఫర్ ఇస్తోంది అక్షర హాసన్ . మరి అక్షర కు అలాంటి రోల్ ఎవరు ఇస్తారో చూడాలి.