
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కోసం.. భారీ ప్లానింగ్ చేస్తున్నాడు డైరెక్టర్ క్రిష్. ఆయన కెరీర్ లోనే ఫస్ట్ టైమ్ హిస్టారికల్ మూవీ చేస్తున్నాడు. ఈసినిమాను ఎంతో పట్టుదలతో.. కొత్త కొత్త ఆలోచనలతో తీర్చి దిద్దుతున్నాడు క్రిష్ (Krish). దాని కోసమే ఓ వ్యక్తిని రంగంలోకి దింపుతున్నాడు.
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తన కెరియర్లోనే తొలి సారిగా చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా చేస్తున్నాడు. హరి హర వీరమల్లు టైటిల్ తో.. పవర్ స్టార్ డిఫరెంట్ లుక్ తో.. క్రిష్ (Krish) డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ సినిమా మొఘల్ కాలం నాటిక కథతో పాటు.. ప్రస్తుత కాలానికి కూడా కనెక్ట్ అయ్యి ఉండేవిధంగా తీర్చి దిద్దుతున్నారు. అంటే పవర్ స్టార్ (Pawan Kalyan) ఇందులో రెండు డిఫరెంట్ లుక్స్ తో కనిపించబోతున్నారు. ఏ ఎం రత్నం నిర్మిస్తున్న ఈసినిమాను క్రిష్ డైరెక్ట్ చేస్తుండగా.. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకూ అయిపోయింది. దాదాపు 40 శాతానికి పైగా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. కరోనా కారణంగా మిగిలిన షూటింగ్ ఆగిపోయింది. త్వరలో ఈ షూటిగ్ కు సంబంధించిన నెక్ట్స్ షెడ్యూల్ ను స్టార్ట్ చేయబోతున్నట్టు తెలస్తోంది. అయితే ఈ షెడ్యూల్ కూడా భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తో స్టార్ట్ చేయాలి అని క్రిష్ ప్లాన్ చేస్తున్నారు. దానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేసుకుంటున్నాడు.
అందుకు సంబంధించిన చర్చలు క్రిష్ (Krish) తో పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఈ యాక్షన్ సీన్స్ కోసం ఫేమస్ ప్రముఖ స్టంట్ మాస్టర్ షామ్ కౌశల్ రంగంలోకి దించబోతున్నారు. ఆయనతో డిస్కర్షన్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. ఈ విషయాన్ని స్వయంగా స్టంట్ మాస్టర్ షామ్ కౌశల్ (sham Kaushal) తన సోషల్ మీడియా పేజ్ లో అనౌన్స్ చేశారు. క్రిష్ (Krish) తో కలిసి ఉన్న ఫోటోను కూడా శేర్ చేశారు ఆయన.
వీరమల్లు గురించి పోస్ట్ రాశారు sham Kaushal . ఈ సినిమా కోసం ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ను ప్లాన్ చేశామనీ, అందుకు సంబంధించిన చర్చలు కూడా పూర్తి అయ్యాయని రాసుకొచ్చారు. భగవంతుడి ఆశీస్సులు తమ టీమ్ పై ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది.
ఇక వీరమల్లును చాలా జాగ్రత్తగా చెక్కుతున్నారు క్రిష్ (Krish). మొగల్ కాలం నాటి భారీ సెట్లు షూటింగ్ కోసం రెడీగా ఉన్నాయి. చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాలు చేయడం లో క్రిష్ (Krish) చాలా నేర్పరి. గౌతమీ పుత్ర శాతకర్ని లాంటి సినిమాలు క్రిష్ అద్భుతంగా తీర్చి దిద్దాడు. ఇక బాలీవుడ్ లో మణికర్ణిక సినిమా కూడా క్రిష్ తెరకెక్కించినదే.
ప్రస్తుతం పవర్ స్టార్(Pawan Kalyan) ను ప్రత్యేక పాత్రలో చూపించడానికి క్రిష్ (Krish) బాగా కష్టపడుతున్నాడు. ఈమూవీ నుంచి పవర్ స్టార్ ప్రత్యేక లుక్ వీడియోను గతంలోనే రిలీజ్ చేశారు. ఈ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది దాంతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. చూడాలి పవర్ స్టార్ తన అభిమానులను ఈ పాత్రతో ఎంతవరకూ అలరించగలడో.