Mahesh Babu : ‘ఎస్ఎస్ఎంబీ28’మూవీ షురూ.. ముగిసిన పూజా కార్యక్రమం.. త్రివిక్రమ్, మహేశ్ హ్యాట్రిక్ కాంబినేషన్..

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 03, 2022, 01:01 PM IST
Mahesh Babu : ‘ఎస్ఎస్ఎంబీ28’మూవీ షురూ..  ముగిసిన పూజా కార్యక్రమం.. త్రివిక్రమ్, మహేశ్ హ్యాట్రిక్ కాంబినేషన్..

సారాంశం

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ల హ్యాట్రిక్ కాంబినేషన్ లో మరో చిత్రం తెరకెక్కనుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై నిర్మించనున్న ఈ చిత్రం తాజాగా పూజా కార్యక్రమం పూర్తి చేసుకుంది.    

సూపర్ స్టార్ మహేశ్ బాబు తన 28వ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తో కలిసి తీయబోతున్నారు. రామానాయుడు స్టూడియోలో ఈ మేరకు తాజాగా పూజా కార్యక్రమాన్ని కూడా చిత్ర  యూనిట్ ఆత్మీయ అతిథుల నడుమ వైభవంగా  పూర్తి చేసుకుంది. కథానాయిక పూజ హెగ్డే పై చిత్రీకరించిన ముహూర్తపు దృశ్యానికి సూపర్ స్టార్ మహేష్ బాబు వైఫ్ నమ్రత శిరోద్కర్ క్లాప్ నిచ్చారు. ప్రముఖ పారిశ్రమికవేత్త సురేష్ చుక్కపల్లి కెమెరా స్విచాన్ చేశారు.

ఈ సారి భారీగా, ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని తెరకెక్కించబోతున్నాడు డైరెక్టర్ త్రివిక్రమ్. కాగా ఈ చిత్రాన్ని మమత సమర్పణలో టాలీవుడ్ అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్  అధినేత సూర్య‌దేవ‌ర  రాధా కృష్ణ ‌(చిన‌బాబు) నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు సరసన అందం, అభినయం కలబోసిన తార ‘పూజాహెగ్డే‘ మరోసారి జతకడుతున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. 

 

 
సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు, మాట‌ల మాంత్రికుడు స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో వస్తున్న ఈ చిత్రం ‘హ్యాట్రిక్ కాంబినేషన్ గా’నిలుస్తోంది. గతంలో ఈ మూవీపై ప్రకటన వచ్చిన నాటినుంచి ఉత్సుకత ఇటు సినీ వర్గాల్లోనూ, అటు ప్రేక్షక వర్గాల్లోనూ నానాటికీ పెరుగుతూ వస్తున్నాయి. ఈ మేరకు చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాన్ని పూర్తి చేసుకోగా, ఏప్రిల్ నుంచి రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది చిత్రయూనిట్ పేర్కొంది. 

మ‌హేష్ బాబు, త్రివిక్ర‌మ్ ల కాంబినేష‌న్‌లో వ‌చ్చిన `అత‌డు`, `ఖ‌లేజా` దశాబ్ద కాలానికి పైగా నేటికీ  ప్రేక్ష‌కుల్ని, అభిమానుల్ని అల‌రిస్తూనే ఉన్నాయి. దశాబ్ద కాలానికి పైగా  ఎదురు చూస్తున్న ఈ క్రేజీ కాంబినేష‌న్‌లో మ‌రో బిగ్గెస్ట్ ఎంట‌ర్‌టైన‌ర్ నేడు ప్రారంభమైందన్న న్యూస్ ఇటు ప్రేక్షకుల్లో, అటు అభిమానుల్లో ఆనందాన్ని నెలకొల్పింది.  

PREV
click me!

Recommended Stories

Shilpa Shetty ఇంట్లో ఐటీ దాడులు? 60 కోట్ల మోసం విషయంలో అసలు నిజం ఏంటో తెలుసా?
మూడో వారంలో ఎలిమినేట్ కావలసిన వాడు తనూజని వాడుకుని విన్నర్ రేసులోకి వచ్చేశాడు.. భరణి సంచలన వ్యాఖ్యలు