F3 Movie : విశ్వదాభిరామ.. ‘ఎఫ్3’సాంగ్స్ హంగామా షురూ రా మామా.. ‘లబ్ డబ్ లబ్ డబ్ డబ్బూ..’ త్వరలో ఫస్ట్ సింగిల్.

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 03, 2022, 12:15 PM IST
F3 Movie : విశ్వదాభిరామ.. ‘ఎఫ్3’సాంగ్స్ హంగామా షురూ రా మామా..  ‘లబ్ డబ్ లబ్ డబ్ డబ్బూ..’ త్వరలో ఫస్ట్ సింగిల్.

సారాంశం

‘ఎఫ్2’తో తెలుగు ఆడియెన్స్ ను ఎంతగానో నవ్వించారు  అనిల్ రావిపూడి. దానికి సీక్వెల్ గా తీసిన ‘ఎఫ్3’ మూవీతో ఇక మరోసారి నవ్వుల పండుగ ప్రారంభం కానుంది. తొలుత పాటలతో ఈ చిత్రం ఆకట్టుకోనుంది. ఈ మేరకు ఫస్ట్ సింగిల్ పై మేకర్స్ అప్డేట్ అందించారు.    

విక్టరీ వెంకటేష్, మెగా  ప్రిన్స్ వరుణ్ తేజ్ కథనాయకులుగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించి తెరకెక్కించిన మూవీ ‘ఎఫ్ 3: ఫన్ అండ్ ఫ్రస్టేషన్’. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ పతాకంపై దిల్ రాజు నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్లను రిలీజ్ చేశారు. తాజాగా మూవీ రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. దీంతో ప్రేక్షకులు  ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో మూవీ మేకర్స్ తాజాగా మరో క్రేజీ అప్డేట్ ను అందించారు. 

ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి ఒక్క సాంగ్ కూడా రిలీజ్ కాలేదు. దీంతో ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, ఫస్ట్ సింగిల్ ను ‘ఫిబ్రవరి  7’న రిలీజ్ చేయనున్నట్టు అఫిషియల్ అనౌన్స్ మెంట్ చేశారు. ఈ మేరకు ఫస్ట్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నట్టు పోస్టర్ ను విడుదల చేశారు. 

 

‘విశ్వదాభిరామ... ఎఫ్3 సాంగ్స్ హంగామా.. షురూ రా మామా ’ అంటూ డైరెక్టర్ అనిల్ రావిపూడి  తన ట్విట్టర్ లో పేర్కొన్నాడు. ఫస్ట్ సింగిల్ ‘లబ్ డబ్ లబ్ డబ్ డబ్బూ.. ’ సాంగ్ కు సంబంధించిన పోస్టర్ ను పోస్ట్ చేశారు. ఈ పోస్టర్ లో విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ పంచెలు కట్టుకొని, నామాలు పెట్టుకొని కనిపిస్తారు.. రూపాయి బిళ్ల రెండు వైపుల గాల్లో తేలి ఉంటుంది. డబ్బుపై కోపం పెంచుకున్నట్టుగా  వెంకటేష్, వరుణ్ తేజ్ ముఖాలు తెలియజేస్తున్నాయి.  మనీపై వస్తున్న ఈ సాంగ్ ఎంత మందిని ఆకట్టుకోనుందో చూడాలి. మరోవైపు సినిమాను ఏప్రిల్ 28న రిలీజ్ చేయనున్నారు.  

PREV
click me!

Recommended Stories

Shilpa Shetty ఇంట్లో ఐటీ దాడులు? 60 కోట్ల మోసం విషయంలో అసలు నిజం ఏంటో తెలుసా?
మూడో వారంలో ఎలిమినేట్ కావలసిన వాడు తనూజని వాడుకుని విన్నర్ రేసులోకి వచ్చేశాడు.. భరణి సంచలన వ్యాఖ్యలు