రియల్‌ హీరో సోనూ సూద్‌కి `ఆచార్య` సెట్‌లో కొరటాల, తనికెళ్ళ సత్కారం

Published : Nov 21, 2020, 11:54 AM ISTUpdated : Nov 21, 2020, 11:57 AM IST
రియల్‌ హీరో సోనూ సూద్‌కి `ఆచార్య` సెట్‌లో కొరటాల, తనికెళ్ళ సత్కారం

సారాంశం

సోనూ సూద్‌ని `ఆచార్య` టీమ్‌ సత్కరించింది. ఆయన మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న `ఆచార్య` చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. షూటింగ్‌లో పాల్గొన్న ఆయనకు చిత్ర బృందం చిరు సత్కారాన్ని అందించింది. సెట్‌లోనే శాలువాతో తనికెళ్ల భరణి, దర్శకుడు కొరటాల శివ సత్కరించారు. 

ఇప్పుడు రియల్‌ హీరో పేరు చెబితే.. సోనూ సూద్‌ పేరే వినిపిస్తుంది. అవును.. ఆయన లాక్‌ డౌన్‌ టైమ్‌లో, అంటే చాలా క్లిష్ట సమయంలో తనవంతుగా కొన్ని వేల మందికి సహాయం చేశారు. కడుపునిండా భోజనం పెట్టాడు. వలస కార్మికులను సురక్షితంగా తన సొంతూళ్లకి పంపించాడు. ఆ తర్వాత కూడా తన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉన్నాడు. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటున్నాడు. గూడు లేని వారికి గూడు ఇస్తున్నాడు. అందుకే ఈయన సినిమాల్లో విలన్‌ అయినా, రియల్‌ లైఫ్‌లో హీరో అయ్యాడు. 

సోనూ సూద్‌ని `ఆచార్య` టీమ్‌ సత్కరించింది. ఆయన మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న `ఆచార్య` చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. షూటింగ్‌లో పాల్గొన్న ఆయనకు చిత్ర బృందం చిరు సత్కారాన్ని అందించింది. సెట్‌లోనే శాలువాతో తనికెళ్ల భరణి, దర్శకుడు కొరటాల శివ సత్కరించారు. ఆయన సేవా కార్యక్రమాలను పొగిడారు. క్లిష్ట సమయంలో పేదలను, కార్మికులను ఆదుకుని తన గొప్ప మనసుని చాటుకున్నారని ప్రశంసించారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు, వీడియో విశేషంగా ఆకట్టుకుంటుంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్