తన ముద్దుల తనయకి స్టయిలీష్ స్టార్‌ అల్లు అర్జున్‌ వండర్‌ఫుల్‌ సర్‌ప్రైజెస్‌..

Published : Nov 21, 2020, 11:30 AM ISTUpdated : Nov 21, 2020, 12:49 PM IST
తన ముద్దుల తనయకి స్టయిలీష్ స్టార్‌ అల్లు అర్జున్‌ వండర్‌ఫుల్‌ సర్‌ప్రైజెస్‌..

సారాంశం

తన ముద్దుల తనయ అల్లు అర్హా పుట్టిన రోజుని పురస్కరించుకుని స్టయిలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ అద్భుతమైన గిఫ్ట్ లు ఇచ్చారు. మొదట ఓ చిన్న గిఫ్ట్ తో సర్‌ప్రైజ్‌ చేసిన బన్నీ.. ఆ తర్వాత ఏకంగా గుర్రాన్నే బహుమతిగా అందించారు. 

తన ముద్దుల తనయ అల్లు అర్హా పుట్టిన రోజుని పురస్కరించుకుని స్టయిలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ అద్భుతమైన గిఫ్ట్ లు ఇచ్చారు. మొదట ఓ చిన్న గిఫ్ట్ తో సర్‌ప్రైజ్‌ చేసిన బన్నీ.. ఆ తర్వాత ఏకంగా గుర్రాన్నే బహుమతిగా అందించారు. మార్నింగ్‌ టైమ్‌లో దానిపై ఎక్కించి కాసేపు తిప్పారు. అంతటితో ఆగలేదు, మరో అద్భుతమైన గిఫ్ట్ ని అందించారు. 

పాపులర్‌ మణిరత్నం-ఇళయరాజా సాంగ్‌ `అంజలి.. అంజలి.. ` పాటతో అర్హాపై తీసిన ఓ స్పెషల్‌ వీడియోని గిఫ్ట్ గా అందించారు. ఈ పాటని సామాజిక మాధ్యమాల విడుదల చేశారు. `అంజలి అంజలి` అంటూ సాగే ఈ పాటకి, అల్లు అర్హాని యాప్ట్ గా డిజైన్‌ చేశారు. ఇప్పుడీ వీడియో సామాజిక మాధ్యమాల్లో విశేషంగా హల్‌చల్‌ చేస్తుంది. 

ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ తన ఏంజెల్‌కి బర్త్ డే విశెష్‌ తెలిపారు. అనంతమైన క్యూట్‌నెస్‌ని తనతో తీసుకొచ్చావని తనయని ఆకాశానికి ఎత్తేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు, `అంజలి .. ` సాంగ్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అలాగే మణిరత్నం- ఇళయరాజా కాంబినేషన్‌లో వచ్చిన  `అంజలి`(1990) చిత్రంలోని పాటని వాడుకున్నందుకు వారికి థ్యాంక్స్ చెప్పారు బన్నీ. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్