
పైద్ద సినిమా టాక్ తేడాగా ఉందన్నప్పుడు ఆ సినిమాకు సంభందించిన ప్రతీ విషయం వైరల్ అవుతుంది. ట్రోల్ చేయటానికి జనం రెడీగా ఉంటారు. ఇప్పుడు అదే పరిస్దితి ఆచార్యకు ఎదురౌతోంది. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆచార్య’. కరోనావల్ల వాయిదా పడుతూ సంక్రాంతికి విడుదల కావాల్సి వున్నా ఆర్.ఆర్.ఆర్., కె.జి.ఎఫ్.2 సినిమాల వల్ల పోస్ట్‌పోన్ అయింది. ఎట్టకేలకు ఈ శుక్రవారమే ఏప్రిల్ 29న విడుదలైంది. ట్రైలర్‌లోనూ పబ్లిసిటీలలో ఆచార్య గురించి, ధర్మస్థలి సెట్ గురించి రకరకాలుగా హైప్ చేశారు. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి, రామ్‌చరణ్ కలయిక మరింత హైప్ క్రియేట్ చేసింది. అయితే సినిమాకు మార్నింగ్ షో నుంచే ప్లాఫ్ టాక్ వచ్చేసింది.
దర్శకుడిగా కొరటాల ఇప్పటివరుకు అపజయం ఎరుగని దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. మిర్చి, జనతాగేరెజ్ సినిమాలలో ఎమోషన్స్ ని రైజ్ చేసి ఫీల్‌ను కలుగజేశాడు. కానీ ఆచార్యలో ఊరు ప్రజలకోసం చేసిన ఫీల్ లోపించింది. సెకండాఫ్‌లో సిద్ధ పాత్ర కనిపించకుండా పోయిన సన్నివేశం హృదయాన్ని టచ్ చేసినా పెద్దగా కలిసి రాలేదు. టోటల్ గా జనాలకు సినిమా ఎక్కలేదు. అయితే దర్శకుడు కొరటాల శివకు అభినందనలు తెలుపుతూ తోటి దర్శకులు సుకుమార్, హరీష్ శంకర్ చిత్ర నిర్మాణ సంస్థ వద్ద టపాసులు కాల్చి కేక్ కట్ చేయించారు.
ఈ వేడుకలో చిత్ర నిర్మాతలు పాల్గొన్నారు. ఆచార్య సినిమా టేకింగ్ బాగుందనీ, నగ్జలైట్ బ్యాక్‌డ్రాప్లో చిరంజీవి, రామ్‌చరణ్ పాత్రలు హైలైట్‌గా వున్నాయని ఈ సందర్భంగా కొరటాల శివను సుకుమార్, హరీష్ శంకర్ అభినందించారు. ఇప్పుడీ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమా ఇంత తేడాగా ఉంటే సెలబ్రేషన్స్ ఏమిటి అంటూ పోస్ట్ లు పెడుతున్నారు.
ఇక ఈ సినిమా ...మెగాస్టార్ ఇమేజ్ కు సరిపడదు. ఇటువంటి కథ ఇప్పటి ట్రెండ్‌కు తగినట్లుగా అనిపించదు. ఇక క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలు ఆమధ్య బ్లాక్‌బస్టర్ అయిన సినిమాను గుర్తు చేస్తాయి. ధర్మాన్ని కాపాడే కథతో చిరంజీవి చేస్తే ఇలా వుంటుందనేది దర్శకుడు చెప్పిన ప్రయత్నం వికటించింది. హిందూ ధర్మం కాపాడాల్సిన బాధ్యత అందరిపైనే వుందని చెబుతూ, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ అన్నలు వస్తారనే హింట్‌ను ఇచ్చాడు. నగ్జలైట్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమా పాత కథలా అనిపించటమే మైనస్ అయ్యింది.