Ram Charan: 'ఆచార్య' రిజల్ట్ పై చరణ్ ఆవేదన? ఫ్యాన్స్ ఏమంటున్నారు

Surya Prakash   | Asianet News
Published : Apr 30, 2022, 08:57 AM IST
Ram Charan: 'ఆచార్య' రిజల్ట్ పై చరణ్ ఆవేదన? ఫ్యాన్స్ ఏమంటున్నారు

సారాంశం

యూఎస్ ప్రీమియర్స్, రెండు తెలుగు రాష్ట్రాలలో బెనిఫిట్ షోస్ పడిన తర్వాత ఆచార్య టాక్ నెగిటివ్‌గానే మొదలైంది. చిరు సినిమాకు ఇంత దారుణమైన టాక్ రావడం చాలా అరుదు.  


 మెగా మల్టీస్టారర్‌గా నిన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఆచార్య. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ ఛాప్టర్ 2 లాంటి భారీ పాన్ ఇండియన్ సినిమాలు వచ్చి బాక్సా ఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నమోదు చేయడంతో ఆ హైప్ ఆచార్యకు వచ్చింది. ఇద్దరు మెగా హీరోలు చిరు – చరణ్ కలిసి మొదటిసారి సిల్వర్ స్క్రీన్ మీద పూర్తి స్థాయిలో కనిపించబోతుండటంతో కేవలం మెగ అభిమానుల్లో మాత్రమే కాకుండా కామన్ ఆడియన్స్‌లో కూడా విపరీతంగా ఎక్సపెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి రీసెంట్ గా  నిర్వహించిన ప్రమోషన్స్ వరకు సినిమాపై ప్రతీదీ అంచనాలు పెంచినదే. కానీ, ఆ అంచనాలను ఆచార్య కాస్త కూడా అందుకోలేకపోయింది. 

మామూలుగా మెగాస్టార్ చిరంజీవి ఉన్నారంటే వారం రోజుల ముందు గానే రిలీజయ్యాక వారం వరకు టికెట్స్ దొరకడం చాలా కష్టమయ్యే పరిస్దితి.  కానీ, చాలాచోట్ల పెద్దగా చెప్పుకోదగ్గ ఓపినింగ్స్ రాలేదు. ప్లాఫ్ టాక్ అంతటా వ్యాపించేయటంతో మాట్నీ ,ఈవినింగ్ షోలపై ఆ ఇంపాక్ట్ కనిపించింది.   చిరు – చరణ్ ఉన్నా ఆచార్యకు అడ్వాన్స్ బుకింగ్స్ చాలా వీక్‌గా కనిపించటమే ట్రేడ్ ని ఆశ్చర్యపరిచింది. యూఎస్ ప్రీమియర్స్, రెండు తెలుగు రాష్ట్రాలలో బెనిఫిట్ షోస్ పడిన తర్వాత ఆచార్య టాక్ నెగిటివ్‌గానే మొదలైంది. చిరు సినిమాకు ఇంత దారుణమైన టాక్ రావడం చాలా అరుదు. ఈ నేపధ్యంలో రీసెంట్ గా ఆర్.ఆర్.ఆర్ తో హిట్ కొట్టిన రామ్ చరణ్ కెరీర్ పై ఈ సినిమా ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతోందనే విషయమై మీడియాలో చర్చ మొదలైంది.

సినిమా సెకండాఫ్ లో రామ్ చరణ్ కనపడతాడు ..ఇది చిరంజీవి సినిమా క్రిందే లెక్క కాబట్టి..ఈ ప్లాఫ్ ని రామ్ చరణ్ ఖాతాలో వెయ్యలేమంటున్నారు చరణ్ ఫ్యాన్స్. అలాగే వరస హిట్స్ మీద ఉన్న రామ్ చరణ్ కు ప్రత్యేకంగా  ఈ సినిమా వలన నష్టపోయేదేమీ ఉండదని చెప్తున్నారు. కేవలం రామ్ చరణ్  తన తండ్రితో కలిసి హిట్ ఇవ్వలేకపోయారే అని బాధ ఉంటుందని చెప్తున్నారు. ఇక రామ్ చరణ్ మాత్రం ఈ రిజల్ట్ తో ఆవేదనతో ఉన్నారని వినికిడి. తన తల్లి కోరికపై తను, తన తండ్రి కలిసి చేసిన సినిమా ఈ స్దాయి రిజల్ట్ రావటం అసలు ఊహించలేదని బాధపడుతున్నారట. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?