
కన్నడ హీరో కిచ్చ సుదీప్, అజయ్ దేవగణ్ మధ్య జరుగుతున్నలాగ్వేజ్ ట్విట్ వార్ ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అయ్యింది. ఇక ఈ టాపిక్ మధ్యలోకి రాజకీయాలు కూడా వచ్చి చేరాయి. ఇక ఈ విషయంలో బాలీవుడ్ స్టార్స్ కూడా డిఫరెంట్ గా స్పందిస్తున్నారు. ఆకరికి ఈ విషయంలో రామ్ గోపాల్ వర్మ కూడా తనదైన మార్క్ స్పందన ఇచ్చారు. ఇక అందరూ ఎదురుచూస్తున్న బాలీవుడ్ కాంట్రవర్సియల్ కింగ్ కంగనా రనౌత్ స్పందన రానే వచ్చింది. ఇంతకీ ఆమె ఏమన్నదంటే.
హిందీ జాతీయ భాష అనే అంశం మీద సుధీన్, అజయ్ దేవగణ్ ఈ ఇద్దరు స్టార్ల మధ్య కోల్డ్ వార్ నడిచింది. ఇండైరెక్ట్ గా సెటైర్లు కూడా వేసుకుంటూ.. వరుస ట్వీట్ లు చేసుకున్నారు హీరోలు. ఇక తాజాగా ఈ గొడవ మధ్యలో వివాదాల హీరోయిన్ కంగనా రనౌత్ కూడా దూరిపోయింది. ఇక కంగనా సీన్ లోకి ఎంటర్ అయితే మామూలుగా ఉండదు కదా.. అందరూ ఒకటి అంటే ఆమె మరోకటి అంటుంది. ఈ విషయంలో కూడా కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది కంగనా.
ఏదో ఒక స్టాండ్ తీసుకుని అవతలి వారిని ఏకి పడేస్తుంటుంది కంగనా రనౌత్ లేకపోతే తన మార్క్ సెటైలర్లతో సందడి చేస్తుంది. ఇక కాంట్రవర్సి క్వీన్ కంగనా కాలుమోపడంతో వివాదం వేరే టర్న్ తీసుకుంది. సుధీప్, అజయ్ దేవగణ్ మధ్య హిందీ విషయంలో రచ్చ జరగటంతో మీడియా కంగనాని కూడా కదిపింది. హిందీ జాతీయ భాష సంగతి ఏంటని అడిగింది. దానికి కాస్త భిన్నంగా స్పందించిన రనౌత్, సంస్కృతం మన జాతీయ భాష కావాలని అభిప్రాయపడింది.
అంతే కాదు, కన్నడ, తమిళం, గుజరాతీ, హిందీ కంటే కూడా సంస్కృతం పురాతనమైందని ఆమె అభిప్రాయపడింది. పైగా భారతీయ భాషలన్నీ సంస్కృతం నుంచే వచ్చాయని కంగనా విశ్లేషించింది. కాబట్టి మనందరికి దేవభాషైన సంస్కృతం కంటే మరేది జాతీయ భాషగా ఉండటానికి తగింది కాదని ఆమె చెప్పేసింది.
హిందీ జాతీయ భాష కాదని వివాదం స్టార్ట్ చేశాడు కన్నడ స్టార్ సుధీప్. అందుకు రివర్స్ కౌంటర్ ఇస్తూ.. హిందీ ఎప్పటికీ జాతీయ భాషేనని అజయ్ దేవగణ్ ట్వీట్ చేశారు. ఇది పెద్ద చర్చకి దారి తీసింది. ఆ నేపథ్యంలోనే కంగనా సంస్కృతాన్ని ముందుకు తీసుకు వచ్చింది. అయితే, ఆమె కన్నడ, తమిళం వంటి దక్షిణాది భాషలకంటే సంస్కృతం పురాతనం అనటం... ఇక్కడి వారు ఎలా స్వీకరిస్తారో చూడాలి.