షాకింగ్.. సూర్యని బ్యాన్ చేసే ప్రయత్నాల్లో కోలీవుడ్ ?

By telugu teamFirst Published Nov 1, 2021, 3:52 PM IST
Highlights

సూర్య నటించిన 'Jai Bhim' మూవీ నవంబర్ 2న అమెజాన్ ప్రైమ్ ఓటిటిలో రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో సూర్య లాయర్ పాత్రలో నటిస్తున్నాడు.

ఎలాంటి పాత్రలో ఒదిగిపోయి నటించే విలక్షణ నటుడు సూర్య. కమర్షియల్ చిత్రాలతో పాటు సూర్య సందేశాత్మక చిత్రాలు కూడా చేస్తున్నాడు. సూర్య నటనకి వంకర పెట్టలేం. గత ఏడాది ఓటిటి లో విడుదలైన సూర్య 'ఆకాశం నీ హద్దురా చిత్రం' విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. అనేక రికార్డులు కూడా సొంతం చేసుకుంది. 

తాజాగా Suriya మరో చిత్రంతో ప్రేక్షకులని అలరించేందుకు రెడీ అవుతున్నాడు. సూర్య నటించిన 'Jai Bhim' మూవీ నవంబర్ 2న అమెజాన్ ప్రైమ్ ఓటిటిలో రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో సూర్య లాయర్ పాత్రలో నటిస్తున్నాడు. దర్శకుడు టీజె జ్ఞానవేల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 

ఇదిలా ఉండగా హీరో సూర్య కొత్త వివాదంలో చిక్కుకున్నారు. కరోనా మొదలైనప్పటి నుంచి ఓటిటి హవా బాగా పెరిగింది. థియేటర్స్ లో రిలీజ్ చేసే పరిస్థితులు లేని సమయంలో.. ఎక్కువ సమయం ఎదురుచూడలేక నిర్మాతలు ఓటిటిని ఎంచుకున్నారు. లాక్ డౌన్ టైంలో ఓటిటిలో చాలా చిత్రాలు నేరుగా విడుదలయ్యాయి. 

ఆకాశం నీ హద్దురా చిత్రం కూడా ఓటిటిలో విడుదలై దుమ్ములేపింది. కొంతమంది నిర్మాతలు ఓటిటి వల్ల సేవ్ అయ్యారు. కానీ ఈ ఓటిటి థియేటర్ వ్యవస్థకి ఇబ్బందిగా మారింది. టాలీవుడ్ లో కూడా ఓటిటి కి వ్యతిరేకంగా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. నాని నటించిన టక్ జగదీశ్ చిత్రం ఓటిటి లో రిలీజ్ కావడం కూడా పెద్ద వివాదమే అయింది. 

ఆకాశం నీ హద్దురా హద్దురా చిత్రం ఓటిటిలో విడుదలయింది.. ఇప్పుడు జై భీమ్ చిత్రాన్ని కూడా ఓటిటిలోనే రిలీజ్ చేస్తుండడంతో సూర్యపై తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. సూర్యని కోలీవుడ్ నుంచి బ్యాన్ చేయాలనీ డిస్ట్రిబ్యూటర్లు సినిమా సంఘాలపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. 

Also Read: RRR Glimpse: ఈ డిటైల్స్ గమనించారా.. ఆ ఒక్కటి మైండ్ బ్లోయింగ్

థియేటర్లు ఓపెన్ అయిన తర్వాత కూడా ఓటిటికీ వెళ్ళవలసిన అవసరం ఏంటని డిస్ట్రిబ్యూటర్లు ప్రశ్నిస్తున్నారు. థియేటర్ వ్యవస్థ వల్లే సూర్య ఇంతటి హీరో అయ్యాడనే సంగతి గుర్తుంచుకోవాలని హెచ్చరిస్తున్నారు. అయితే సూర్య తరుపున వారి వాదన వేరేలా ఉంది. జై భీమ్ చిత్రానికి, అమెజాన్ సంస్థకు కరోనా టైంలోనే ఒప్పందం జరిగిందని.. ఆ ఒప్పందం ప్రకారమే ప్రస్తుతం ఓటిటిలో రిలీజ్ అవుతున్నట్లు చెబుతున్నారు. ఇందులో సూర్య తప్పు లేదని అంటున్నారు. 

Also Read: అంత అసభ్యంగా నేను చేయలేను.. 'హేట్ స్టోరీ 4' పై నటి షాకింగ్ కామెంట్స్

click me!