సినీనటి సంధ్య దారుణహత్య: చంపి ముక్కలుగా కోసిన భర్త

By Siva KodatiFirst Published 7, Feb 2019, 7:39 AM IST
Highlights

తమిళ సినీ పరిశ్రమకు చెందిన నటి సంధ్య దారుణహత్యకు గురయ్యారు. కట్టుకున్న భర్తే ఆమెను దారుణంగా హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే.... కన్యాకుమారి జిల్లా నాగర్‌కోవిల్‌కు చెందిన సంధ్య సినిమాల్లో చిన్నా, చితకా పాత్రలు వేసేవారు. ఆమె భర్త బాలకృష్ణన్ సైతం దర్శకుడే. 

తమిళ సినీ పరిశ్రమకు చెందిన నటి సంధ్య దారుణహత్యకు గురయ్యారు. కట్టుకున్న భర్తే ఆమెను దారుణంగా హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే.... కన్యాకుమారి జిల్లా నాగర్‌కోవిల్‌కు చెందిన సంధ్య సినిమాల్లో చిన్నా, చితకా పాత్రలు వేసేవారు. ఆమె భర్త బాలకృష్ణన్ సైతం దర్శకుడే. ఈ జంట చెన్నై ఈక్కాడుతాంగల్‌లో నివసించేవారు.

రాత్రి వేళల్లో ఫోన్‌లో మాట్లాడటం, బయటకు వెళ్లడం వంటి చర్యలు బాలకృష్ణన్‌కు సంధ్యపై అనుమానాలు కలిగించింది. ఆమె పలువురితో వివాహేతర సంబంధాలు పెట్టుకుందని అనుమానించిన అతను ఓ రోజు నిలదీయడంతో తన అక్రమ సంబంధాన్ని బయటపెట్టింది.

దీంతో వీరిమధ్య ప్రతిరోజు గొడవలు జరిగేవి. ఈ క్రమంలో కలిసి జీవించలేదక విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. సంధ్య సైతం తాను ప్రియునితోనే ఉంటానని తేల్చి చెప్పింది. ఈ నెల 19న మరోసారి వివాహేతర సంబంధం గురించి ఘర్షణ జరగడంతో అప్పటికే సంధ్యను చంపాలనుకున్న బాలకృష్ణన్ కత్తితో ఆమెను విచక్షణారహితంగా పొడిచాడు.

అనంతరం మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి నగరంలోని పలు చోట్ల పడేశాడు. ఈ క్రమంలో చెన్నై నగర శివారు పెరుంగడి చెత్తకుప్పల్లో గుర్తు తెలియని మహిళకి చెందిన రెండు కాళ్లు, ఒక చేతిని గత నెల 21న గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రెండు వారాలపాటు శ్రమించి మృతురాలిని సినీనటి సంధ్యగా గుర్తించారు. 2 వారాల పాటు శ్రమించి ఆమె భర్తను పట్టుకుని మిస్టరినీ చేధించారు.
 

Last Updated 7, Feb 2019, 7:39 AM IST