సెంటిమెంట్ లో మహానాయకుడు న్యూ రిలీజ్ డేట్!

Published : Feb 06, 2019, 09:34 PM ISTUpdated : Feb 06, 2019, 10:35 PM IST
సెంటిమెంట్ లో మహానాయకుడు న్యూ రిలీజ్ డేట్!

సారాంశం

ఎంతో ప్రతిష్ట్మాకంగా తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ ఫస్ట్ పార్ట్ రిలీజ్ కు ముందు చేసిన హంగామా రిలీజ్ అనంతరం కొనసాగించాలకేపోయింది. కథానాయకుడు భారీ నష్టాలను మిగిల్చడంతో సెకండ్ పార్ట్ మహానాయకుడిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

ఎంతో ప్రతిష్ట్మాకంగా తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ ఫస్ట్ పార్ట్ రిలీజ్ కు ముందు చేసిన హంగామా రిలీజ్ అనంతరం కొనసాగించాలకేపోయింది. కథానాయకుడు భారీ నష్టాలను మిగిల్చడంతో సెకండ్ పార్ట్ మహానాయకుడిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అసలు సినిమాను జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఎవరు ఊహించని విధంగా ఉంది. 

అసలైతే ఈ సమయానికి  మహానాయకుడు రిలీజ్ హడావుడిలో ఉండాలి. ఫిబ్రవరి 7న రిలీజ్ కాబోతున్నట్లు చిత్ర యూనిట్ అప్పట్లో ప్రమోషన్స్ స్ట్రాంగ్ గా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ డేట్ ను క్యాన్సల్ చేయడంతో కొత్త డేట్ కోసం ఓ వర్గం వారు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాజకీయ నేపథ్యంలో ఎన్టీఆర్ జీవితాన్ని సెకండ్ పార్ట్ లో చూపించనున్నారు. 

రానున్న తెలుగు సినిమాల రిలీజ్ డేట్స్.. (అప్డేట్)

అయితే ఈ మహానాయకుడు సినిమాను బాలకృష్ణ సెంటిమెంట్ గా మహా శివరాత్రికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 28 లేదా మార్చ్ 1 అని కొత్త తేదీల గురించి బాలయ్య టీమ్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. కుదిరితే మొదటి డేట్ కె సినిమాను రిలీజ్ చెయ్యాలని సన్నాహకాలు చేస్తున్నారు. మరి మహాశివరాత్రి మూమెంట్ సినిమాకు ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి. 

PREV
click me!

Recommended Stories

Rajamouli: అందుకే రాజమౌళి, మంచు మనోజ్ లకు చుక్కలు.. ఆ దేవతలతో పెట్టుకున్నారు, వేణు స్వామి తీవ్ర వ్యాఖ్యలు
Priyanka Chopra: పారిస్‌లో ప్రియాంక - నిక్ రొమాంటిక్ గ్లామర్ షో, పెళ్లై 7 ఏళ్లైనా తగ్గని ప్రేమ..