కాలుకి తీవ్ర గాయమై.. నడవలేని స్థితిలో ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్.. ఎలా జరిగింది!

By Asianet News  |  First Published Mar 9, 2023, 2:57 PM IST

తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో పరిచయం అయిన హీరోయిన్ కనిహా (Kanika) కాలుకి గాయమైంది. తానే స్వయంగా ఫొటోలను పంచుకోవడంతో ఫ్యాన్స్ ఆందోళన పడుతున్నారు. పిక్స్ వైరల్ గా మారాయి.
 


టాలీవుడ్ సీనియర్ నటుడు  శ్రీకాంత్ సరసన ‘ఒట్టేసి చెబుతున్న’ హీరోయిన్ కనిహా తాజాగా గాయపడింది. 
తెలుగు ప్రేక్షకులను ఎంతో మంది అలరిస్తున్న కొందరు హీరోయిన్లు ఎప్పటికి గుర్తుండిపోతారు. ఈకోవలోకే వస్తుంది  నటి కనిహ. టాలీవుడ్ ఎంట్రీతోనే మంచి గుర్తింపును దక్కిచుకుంది. తెలుగులో కేవలం రెండు సినిమాల్లోనే నటించి ఆకట్టుకుంది. ప్రస్తుతం మలయాళంలో జోరుగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా ఆమె కాలుకు గాయమైనట్టు తెలుస్తోంది.

ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా కొన్ని ఫొటోలను పంచుకుంది కనిహా. ఫొటోల్లో తన కాలుకి ఫ్రాక్చర్ కారణంగా నడవలేని స్థితిలో ఉన్నట్టు తెలిపింది. యాంకిల్ కు గాయమవడంతో నేలపై పాదం మోపలేకపోతున్నట్టు తెలిపింది. అందుకే వాకర్ సాయంతో కాస్తా బాలెన్డ్స్ గా నడుస్తున్నట్టు చెప్పుకొచ్చింది.  ఇప్పటికే వారం పాటు ఇంట్లోనే ఉన్నాని.. మరో ఐదు రోజు రెస్ట్ అవసరం అంటూ వైద్యులు సూచించారంది. 

Latest Videos

కనిహా గాయపడ్డ ఫొటోను ఇన్ స్టా గ్రామ్ ద్వారా పంచుకోవడంతో అభిమానులు ఆందోలళన పడుతున్నారు. ఏమైందంటూ కంగారు పడుతున్నారు. మరోవైపు సినీ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. విషయం తెలుసుకొని.. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా వహించాలని ఆమెకు సూచిస్తున్నారు. కనిహాకు 2008లో శ్యామ్ రాధా క్రిష్ణన్ వ్యక్తితో పెళ్లైంది.  తెలుగులో ఈమె ‘ఒట్టేసి చెబుతున్నా’ మరియు ‘నా ఆటోగ్రాఫ్’ సినిమాల్లో నటించింది. 

తెలుగులో అంతగా గుర్తింపులేని హీరోయిన్ తమిళం, మలయాళంలో మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుంది.  ప్రస్తుతం మలయాళంలో వరుస పెట్టి చిత్రాలు చేస్తోంది.  కనిహా నటిగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గానూ ఆయా తమిళ సినిమాలకు వర్క్ చేశారు. ప్లే బ్యాక్ సింగర్ గానూ ఆకట్టుకుంటున్నారు.  అలాగే టీవీ షోలతోనూ తమిళం, మలయాళం ఆడియెన్స్ కు బాగా దగ్గరయ్యారు. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kaniha (@kaniha_official)

click me!