Kiran Abbavaram Upcoming film : క్రేజీ ప్రాజెక్ట్ తో కిరణ్ అబ్బవరం.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్..

By team telugu  |  First Published Feb 23, 2022, 1:56 PM IST

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (kiran Abbavaram) వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఒకవైపు ‘సెబాస్టియన్ పీసీ 524’ మూవీని రిలీజ్ కు సిద్ధం చేశాడు. ప్రస్తుతం మరో క్రేజీ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించాడు.  ఈ సందర్భంగా తన అప్ కమింగ్ ఫిల్మ్ ఫస్ట్ లుక్, టైటిల్  పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్..
 


యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) ఒకరు. ‘ఎస్ఆర్ కళ్యాణ మండపం’తో సక్సెస్ పొందిన కిరణ్.. అదే జోష్ లో వరుస సినిమాలు చేస్తున్నారు. విభిన్న కథాంశాలతో  సినిమాలను తెరకెక్కించి తన సత్తా చాటుతున్నాడు. మంచి మంచి కాన్సెప్ట్ లతో సినిమాలు చేస్తూ.. ఆడియన్స్ దృష్టి ని ఆకర్షిస్తున్నాడు. ఇప్పటికే తను నటించిన తాజా చిత్రం ‘సెబాస్టియన్ పీసీ 524’ మూవీని రిలీజ్ కు సిద్ధం చేశాడు. ప్రస్తుతం మరో క్రేజీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు కిరణ్.   

యంగ్ స్టార్ కిరణ్ అబ్బవరం దూసుకుపోతున్నాడు. వరుస సినిమాలతో సత్తా చాటుతున్నారు. మంచి మంచి కాన్సెప్ట్ లతో సినిమాలు చేస్తూ.. ఆడియన్స్ దృష్టి ని ఆకర్షిస్తున్నాడు. బ్యాక్ టు బ్యాక్ మంచి హిట్స్ అందుకుంటూ వెళ్తున్న ఈ యంగ్ హీరో మరిన్ని ఆసక్తికర ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే కొన్ని సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.  అయితే మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్  కు సంబంధించిన అప్డేట్ అందింది. దర్శకుడు కార్తీక్ శంకర్ తో కిరణ్ కలిసి పనిచేస్తున్నారు. ఈ సినిమాకు ‘మీకు బాగా కావాల్సిన వాడిని’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. అయితే  ‘ఎస్ ఆర్ కల్యాణమండపం’ లో హిట్ డైలాగ్ నే ఈ మూవీ టైటిల్ గా పెట్టడం పట్ల మరింత మంది ఆడియెన్స్ ను ఈజీగా చేరుకుంటోందీ సినిమా. టైటిల్ పోస్టర్ లో కిరణ్ ఫస్ట్ లుక్ పక్కా మాస్ లుక్ గా  కనిపిస్తోంది. ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ గా ఈ మూవీ తెరకెక్కుతున్నట్టు సమాచారం. ఈ సినిమాని కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Latest Videos

 

Nenu meku baga kavalsinavadini 😇🙏 🔥 💥

A Musical 🎵 @kodi_divya8 @kaarthik_shankar @nareshreddy_mule @bharat_rongali pic.twitter.com/CbCMSX3JnK

— Kiran Abbavaram (@Kiran_Abbavaram)

కిరణ్ తాజా చిత్రం ‘సెబాస్టియన్ పీసీ 524’ మార్చి 4న రిలీజ్ కానుంది. ఇక ఈ మూవీతో హ్యాట్రిక్‌ హిట్‌ అందుకోవడానికి రెడీ అవుతున్నారు. జ్యోవిత సినిమాస్‌ పతాకంపై ఎలైట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో కిరణ్‌ అబ్బవరం, కోమలీ ప్రసాద్‌, నువేక్ష  జంటగా.. బాలాజీ సయ్యపురెడ్డి డైరెక్ట్ చేసిన సినిమా సెబాస్టియన్‌ పిసి524. ప్రపంచ వ్యాప్తంగా ఆడియెన్స్ ను అలరించనుంది. రేచీకటి నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. రేచీకటి గల హీరోకి పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగం వస్తుంది. అతడు నైట్‌ టైం డ్యూటీ ఎలా చేశాడు? రేచీకటి వల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? అనేది సినిమా కథ. యూత్ లో కిరణ్ కు మంచి ఫాలోయింగ్ ఉండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు పెరిగిపోయాయి.

click me!