The Warrior: 'ది వారియర్‌' రిలీజ్ డేట్ ఫిక్సైంది..ఎప్పుడంటే

Surya Prakash   | Asianet News
Published : Feb 23, 2022, 11:42 AM IST
The Warrior: 'ది వారియర్‌'  రిలీజ్ డేట్ ఫిక్సైంది..ఎప్పుడంటే

సారాంశం

ఈ సినిమాలో రామ్‌ పోలీసు అధికారిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు పోలీస్‌ రోల్‌లో రామ్‌ చేయలేదు. దీంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.


ఎప్పుడైతే ఇస్మార్ట్ శంకర్ సినిమా విడుదలైందో.. అప్పట్నుంచే రామ్ తనను తాను పూర్తిగా మార్చుకున్నాడు. రామ్‌ పోతినేని హీరోగా తమిళ స్టార్‌ డైరెక్టర్‌ లింగుస్వామి దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కృతీ శెట్టి, అక్షర గౌడ హీరోయిన్లుగా చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా'ది వారియర్‌' అనే టైటిల్‌ను ఖరారు చేసి పోస్టర్ వదిలితే మంచి రెస్పాన్స్ వచ్చింది.  శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం రిలీజ్ డేట్ బయిటకు వచ్చింది.

అందుతున్న సమాచారం మేరకు జూలై 1, 2022 న తెలుగు,తమిళ భాషల్లో ఈ సినిమా రిలీజ్ చేయటానికి విడుదల తేదీని ఫిక్స్ చేసారు. ఈ చిత్రంలో మరోసారి విలనిజం చూపించనున్నాడు ఆది పినిశెట్టి. సరైనోడు తర్వాత రెండోసారి పూర్తి స్థాయి విలన్ పాత్రలో నటించనున్నాడు.  రొమాంటిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పోస్టర్ రిలీజ్ తర్వాత మంచి క్రేజ్ వచ్చింది.

ఈ సినిమాలో రామ్‌ పోలీసు అధికారిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు పోలీస్‌ రోల్‌లో రామ్‌ చేయలేదు. దీంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.  

లింగుస్వామి సినిమాతో తమిళంలో కూడా మార్కెట్ ఓపెన్ చేసుకోవాలని చూస్తున్నాడు రామ్. అందుకే ఆయనకు ఓకే చెప్పాడు. ఈ మధ్య కాలంలో లింగుస్వామికి కూడా సరైన హిట్ లేదు. ఇలాంటి సమయంలో ఈయనతో సినిమా చేస్తున్నాడు. రామ్ కెరీర్‌కు కూడా ది వారియర్ కీలకంగా మారింది.

PREV
click me!

Recommended Stories

1000 కోట్ల సినిమా ను ఒక ఫ్లాప్ మూవీ కోసం వదిలేసుకున్న నాగార్జున, కారణం ఏంటో తెలుసా?
Soundarya కి ఉన్న అరుదైన హ్యాబీ ఏంటో తెలుసా? ఖాళీ టైమ్‌లో ఆమె చేసి పని ఇదే