Sri Simha Next Movie : ఎంఎం కీరవాణి తనయుడు సింహా నెక్ట్స్ మూవీ టైటిల్ అదిరింది.. ఇంట్రెస్టింగ్ గా ఫస్ట్ లుక్..

Published : Feb 23, 2022, 12:58 PM IST
Sri Simha Next Movie : ఎంఎం కీరవాణి తనయుడు సింహా నెక్ట్స్ మూవీ టైటిల్ అదిరింది.. ఇంట్రెస్టింగ్ గా ఫస్ట్ లుక్..

సారాంశం

ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి (MM Keeravani) తనయుడు శ్రీ సింహా అప్ కమింగ్ ఫిల్మ్ టైటిల్ అదిరిపోయింది.  మత్తు వదలరా.. తెల్లవారితే గురువారం.. వంటి  చిత్రాల్లో సింహా  నటించాడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా నెక్ట్స్ మూవీ టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్..

చైల్డ్ ఆర్టిస్ట్ గానే శ్రీ సింహా తన కేరీర్ ను ప్రారంభించాడు. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి(SS Rajamouli) డైరెక్టర్ చేసిన యమదొంగ.. మర్యాద రామన్న.. ఈగ.. వంటి చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. 2019లో మైత్రి మూవీస్ సంస్థ రితేష్ రానా డెబ్యూ దర్శకుడితో  నిర్మించిన 'మత్తు వదలరా'అనే చిత్రంలో లీడ్ రోల్ చేశారు.  ఇది సింహాకు తొలిచిత్రం. ఈ చిత్రంతో బెస్ట్ డెబ్యూ మేల్ యాక్టర్ సైమా అవార్డును పొందాడు. ఆ తర్వాత గతేడాది ‘తెల్లవారితే గురువారం’ మూవీతో ప్రేక్షకులను అలరించాడు. 

ప్రస్తతం సింహా కోడూరి మరో మూవీ చేస్తున్నారు. ఈరోజు ఆయన 26వ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. సతీష్ త్రిపుర దర్శకత్వంలో ప్లాన్ చేసిన ఈ సినిమాకి ‘దొంగలున్నారు జాగ్రత్త’ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఇంట్రెస్టింగ్ ఫస్ట్ లుక్ ని కూడా రివీల్ చేశారు. బ్యాక్గ్రౌండ్ లో లోకేషన్ సింబర్.. సీసీ కెమెరా కింద మ్యాప్ తో ఏదో లొకేషన్ వైపుగా రహదారిపై కారు వెళ్తోంది. అందులో సింహా ఇరుక్కున్నట్టు కనిపిస్తున్నాడు.

 

ఈ పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటోంది. పోస్టర్ ను పరిశీలిస్తే.. ఈ సినిమాలో హీరో ఒక దొంగ పాత్ర చేయబోతున్నాడా? లేక దొంగలను చేధించే పాత్ర చేయబోతున్నాడా? అన్నది సందిగ్ధంగా ఉంది. కానీ ఏదోక దశలో హీరో  రాంగ్ రూట్ ప్రయాణించి..  చేరుకోకూడని ప్రదేశానికి వెళ్లినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత అక్కడి ఎదుర్కొన్న సమస్యలు, వాటి నుంచి బయట పడే మార్గాల మధ్య కథ కొనసాగనున్నట్టు అర్థమవుతోంది. కాగా ఈ ఏడాదే మూవీని రిలీజ్ చేసే పనిలో ఉందంట చిత్ర యూనిట్. 

తన మొదటి సినిమా తోనే మంచి హిట్ అందుకున్న ఈ యంగ్ హీరో తర్వాత కూడా మరిన్ని మంచి సబ్జెక్టు లు ఎంచుకుంటూ వస్తున్నాడు. ఆ కోవకు చెందినదే ‘దొంగలున్నారు జాగ్రత్త’. ఇది కూడా మంచి థ్రిల్లర్ డ్రామాలా అనిపిస్తుంది. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ సినిమాకి సింహా సోదరుడు కాల భైరవనే సంగీతం అందిస్తున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.  మరోవైపు పుట్టిన రోజు సందర్భంగా సింహాకు సినీ రంగంలోని పలువురు బెస్ట్ విషేస్ తెలుపుతున్నారు. సింగర్ నోయల్ కూడా తన విషేస్ తెలిపాడు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Ee Nagaraniki Emaindhi 2: శ్రీనాథ్ మాగంటికి బంపర్‌ ఆఫర్‌, ఈ నగరానికి ఏమైంది సీక్వెల్‌లో ఛాన్స్.. పాత్ర ఇదే
Divi Vadthya: లవ్ బ్రేకప్‌తో డిప్రెషన్‌లోకి వెళ్లా, మళ్లీ ఆ కష్టాలు రావద్దు.. నటి దివి వద్త్య ఎమోషనల్‌