Nagarjuna: 1000 ఎకరాల ఫారెస్ట్ ని దత్తత తీసుకోనున్న కింగ్ నాగార్జున

Published : Dec 13, 2021, 11:08 AM ISTUpdated : Dec 13, 2021, 11:09 AM IST
Nagarjuna: 1000 ఎకరాల ఫారెస్ట్ ని దత్తత తీసుకోనున్న కింగ్ నాగార్జున

సారాంశం

కింగ్ నాగార్జున (Nagarjuna) సామాజిక సేవలో భాగంగా గొప్ప నిర్ణయం తీసుకున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం 1000 ఎకరాల అడవిని దత్తత తీసుకోనున్నట్లు వెల్లడించారు. 

రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ జోగినపల్లి కొన్నాళ్లుగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ (Green India Challenge)ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. కాలుష్యంతో ప్రపంచ పర్యావరణం వేగంగా దెబ్బతింటుంది. వాయు కాలుష్యం తగ్గించాలన్నా... సకాలంలో వర్షాలు పడాలన్నా చెట్లు విరివిగా పెంచడమే ఏకైక మార్గం. సంతోష్ కుమార్ దీని కోసం తీవ్ర కృషి చేస్తున్నారు. సెలెబ్రిటీలు, ప్రముఖులను గ్రీన్ ఇండియా ఉద్యమంలో భాగం చేస్తూ.. సాధారణ ప్రజల్లో అవగాహన కలిగేలా చేస్తున్నారు.  మూడేళ్ళ కాలంలో సంతోష్ కుమార్ 16కోట్ల మొక్కలు నాటేలా చర్యలు తీసుకున్నారు.

 ఈ నేపథ్యంలో అత్యంత ప్రజాదరణ కలిగిన బిగ్ బాస్ వేదికగా(Bigg boss Telugu 5).. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి ప్రచారం కల్పించడానికి వచ్చారు. బిగ్ బాస్ వేదికపై హోస్ట్ నాగార్జునను కలిశారు. ఈ సందర్భంగా నాగార్జున ప్రభాస్ ఓ ఫారెస్ట్ ని దత్తత తీసుకున్న విషయం గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే తాను కూడా ఓ అడవిని దత్తత తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు సంతోష్ కుమార్ కి తెలియజేశారు. 

నాగార్జున నిర్ణయానికి సంతోషించిన ఆయన దానికి సంబంధించిన ఏర్పాట్లు మా టీమ్ చేస్తుందని తెలియజేశారు. అలాగే పర్యావరణం కోసం... ఈ వారం రోజుల్లో ప్రతి ఒకరు మూడు మొక్కలు నాటాలని, నేను కూడా ఆ పని చేస్తానని నాగార్జున తెలియజేశారు. బిగ్ బాస్ వేదిక సాక్షిగా వేయి ఎకరాల అడవిని దత్తత తీసుకోవాలన్న నాగార్జున నిర్ణయాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. ఇక బిగ్ బాస్ హౌస్ లో సంతోష్ కుమార్ తీసుకు వచ్చిన మొక్కను నాటనున్నట్లు నాగార్జున తెలియజేశారు. మీ గ్రామంలో, మండలంలో, నియోజకవర్గంలో మొక్కలు నాటండని సంతోష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. 

Also read Bigg boss Telugu 5: అనూహ్యంగా టాప్ కంటెస్టెంట్స్ అవుట్... ఫైనల్ కి చేరిన 5 కంటెస్టెంట్స్ వీరే

మరోవైపు బిగ్ బాస్ షో చివరి దశకు చేరుకుంది. నిన్న కాజల్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు. దీనితో సన్నీ, మానస్, శ్రీరామ్, షణ్ముఖ్, సిరి ఫైనల్ కి చేరారు. వీరిలో ఒకరు బిగ్ బాస్ టైటిల్ అందుకోనున్నారు. 
Also read BIG BOSS5: ; పింకీకి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చి సర్ ప్రైజ్ చేసిన ప్రియ

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే