Miss Universe 2021: మిస్ యూనివర్స్ టైటిల్ గెలిచిన హర్నాజ్ సంధు నేపథ్యం ఇదే!

Published : Dec 13, 2021, 09:55 AM ISTUpdated : Dec 13, 2021, 10:10 AM IST
Miss Universe 2021: మిస్ యూనివర్స్ టైటిల్ గెలిచిన హర్నాజ్ సంధు నేపథ్యం ఇదే!

సారాంశం

2021 మిస్ యూనివర్స్ (Miss Universe 2021)టైటిల్ ఇండియాకు దక్కింది. ఇజ్రాయెల్ దేశంలోని ఇలియట్ నగరం 70వ మిస్ యూనివర్స్ పోటీలకు వేదిక కాగా.. ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న హర్నాజ్ సంధు టైటిల్ గెలిచి భారత పతాకం రెపరెపలాడించారు.   

పంజాబీ కుటుంబానికి చెందిన 21ఏళ్ల హర్నాజ్ సంధు (Harnaaz Sandhu) 70వ మిస్ యూనివర్స్ కాంటెస్ట్ లో భారత్ తరపున ప్రాతినిధ్యం వహించారు. ఉత్కంఠ రేపిన పోటీలో ఫైనల్ లో  పెరుగ్వే, సౌత్ ఆఫ్రికాకు చెందిన అందాల భామలతో పోటీపడి  హర్నాజ్ సంధు టైటిల్ కైవసం చేసుకున్నారు. 21 ఏళ్ల తరువాత భారత్ కి మిస్ యూనివర్స్ టైటిల్ దక్కింది. చివరిగా 2000లో లారా దత్త(Lara Datta) భారత్ నుండి మిస్ యూనివర్స్ టైటిల్ అందుకున్నారు. 

ఫైనల్ లో పెరుగ్వే, సౌత్ ఆఫ్రికా, ఇండియా నిలిచాయి. ఈ ముగ్గురిని నిర్వాహకులు ఒకే ప్రశ్న అడిగారు. ఒత్తడిని అధిగమించడంలో యువతులకు మీరు ఇచ్చే సలహా ఏమిటి? అని అడగడం జరిగింది. ఈ ప్రశ్నకు హర్నాజ్...' ప్రస్తుతం యువతులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య , తమని తాము నమ్మకపోవడం. మీలో ఉన్న ప్రత్యేకతను గుర్తించడం మిమ్మల్ని అందంగా మార్చేస్తుంది. అలాగే ఇతరులతో పోల్చుకోవడం మానేయండి. ప్రపంచంలో ఏమి జరుగుతుంతో మాట్లాడండి. మీ జీవితానికి మీరే లీడర్ గా ఉండండి. విషయం ఏదైనా ధైర్యంగా మాట్లాడండి. నా జీవితాన్ని నేను ఎంతగానో ప్రేమిస్తాను, అందుకే నేను ఇప్పుడు మీ ముందు ఉన్నాను...' అని సమాధానం చెప్పారు. 

Also read 2021లో ఒక ఊపు ఊపేసిన ఐటెం సాంగ్స్ ఇవే.. 'భూమ్ బద్దల్ నుంచి 'ఊ అంటావా' వరకు
మిస్ యూనివర్స్ టైటిల్ అందుకున్న మూడవ భారత మహిళగా హర్నాజ్ సంధు రికార్డులకు ఎక్కారు. 1994లో మొదటిసారి సుస్మితా సేన్ (Susmita sen) భారత్ తరపున మిస్ యూనివర్స్ టైటిల్ అందుకున్నారు. 2000లో లారా దత్త ఈ టైటిల్ కైవసం చేసుకోవడం జరిగింది. 21 ఏళ్ల తర్వాత మరలా మిస్ యూనివర్స్ టైటిల్ ఇండియాకు వచ్చింది. 2021 అక్టోబర్ లో హర్నాజ్ సంధు మిస్ యూనివర్స్ ఇండియా 2021 టైటిల్ అందుకున్నారు. ప్రస్తుతం ఆమె పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నారు. 

Also read Pushpa: పుష్ప ఒక్క మూవీ నాలుగు సినిమాల కష్టం.. బాలయ్యకు కంగ్రాట్స్ చెప్పిన బన్నీ

హర్నాజ్ సంధు 17ఏళ్లకే మోడలింగ్ లో అడుగుపెట్టారు. మిస్ దివా 2021, మిస్ ఇండియా పంజాబ్  2019 టైటిల్స్ ఆమె గెలవడం జరిగింది. ఫెమినా మిస్ ఇండియా 2019 కాంటెస్ట్ లో ఆమె టాప్ 12లో నిలిచారు. కాగా పంజాబీ చిత్రాల్లో కూడా హర్నాజ్ సంధు నటించడం జరిగింది. యారా దియాన్ పో బరన్ , బాయ్ జి కుట్టాగే చిత్రాలలో ఆమె నటించారు. 

హర్నాజ్‌ చిన్నప్పటి నుంచి యోగా చేయ‌డం అల‌వాటుగా ఉంది.  ఫిట్‌నెస్ కోసం ఎక్కువ ప్రధాన్య‌త ఇస్తారు.  గుర్రపు స్వారీ, ఈత, డ్యాన్స్, యాక్టింగ్, ట్రావెలింగ్ చేయ‌డం త‌న‌కు అమితంగా ఇష్ట‌మ‌ని ఇదివ‌ర‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూల్లో వెల్ల‌డించారు. చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించాలనే కోరిక ఉండేద‌ని చెప్పింది. అయితే, బ‌క్క‌గా, స‌న్న‌గా ఉండ‌టంపై హేల‌న చేసేవారు. ఇవేవి పట్టించుకోకుండా.. కుటుంబ స‌భ్యుల స‌హ‌కారంతో 17 ఏండ్ల‌కే మోడ‌లింగ్ లో అడుగుపెట్టారు. కాలేజీలో తొలి స్టేజ్‌ ప్రదర్శనతో తన మోడలింగ్ ప్ర‌యాణం ప్రారంభించారు. ఒకపక్క మోడలింగ్‌ చేస్తూనే మ‌రోప‌క్క  ఫ్యాషన్‌ షోల్లోనూ  పాల్గొనేది.

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే