కిమ్ కు భర్తతో కటీఫ్ కాకుండానే కొత్త బోయ్ ఫ్రెండ్

Published : Jan 20, 2017, 04:32 PM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
కిమ్ కు భర్తతో కటీఫ్ కాకుండానే కొత్త బోయ్ ఫ్రెండ్

సారాంశం

చేసింది రెండే అయినా తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పెళ్లయినా భర్తకు దూరంగా ఉంటున్న కిమ్ శర్మ విడాకులివ్వకుండానే మరో వ్యక్తితో చెట్టాపట్టాల్

ఖడ్గం సినిమాదతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ కిమ్ శర్మ. మగధీరలో సైతం సాంగ్ లో మెరిసిన ఈ భామ ఇప్పుడు న్యూస్ క్రియేట్ చేస్తోంది. భర్త కు విడాకులు ఇవ్వకుండానే మరొకరితో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ సంచలనం సృష్టిస్తోంది. గతంలో క్రికెటర్ యువరాజ్ సింగ్ తో పీకల్లోతు ప్రేమాయణం సాగించి పెళ్లి దాకా వెళ్లినా అది పెటాకులైంది. యువీతో సంబంధాలు దెబ్బతినడంతో మరొకరితో ప్రేమాయణం సాగించింది కిమ్.

 

2010 లో బిజినెస్ మెన్ అయిన అలీ పంజాణిని పెళ్లి చేసుకుంది కిమ్ . కొన్నాళ్ల పాటు సాఫీగానే సాగిన వీళ్ళ కాపురంలో కలతలు చోటు చేసుకోవడంతో కొంతకాలంగా విడిగా ఉంటున్నారు అయితే విడాకులు మాత్రం తీసుకోలేదు . ఇక తాజా విషయానికి వస్తే డిజైనర్ అర్జున్ ఖన్నా తో కిమ్ డేటింగ్ లో ఉంది . ఈమధ్య ఎక్కడ చూసిన ఈ ఇద్దరూ జంటగా కనిపిస్తూ బాలీవుడ్ జనాలకు షాక్ ఇస్తున్నారు. మరోవైపు అర్జున్ ఖన్నా కు కూడా పెళ్లయినా అతడు కూడా భార్యకు దూరంగా ఉంటున్నాడు . కిమ్ శర్మ తన కొత్త బోయ్ ఫ్రెండ్ అర్జున్ ఖన్నా తో సహజీవనం చేస్తోందని బాలీవుడ్ కోడై కూస్తోంది.

PREV
click me!

Recommended Stories

'సంక్రాంతికి వస్తున్నాం' రీమేక్ లో హీరోయిన్ గా 46 ఏళ్ళ నటి.. దిల్ రాజు ప్లానింగ్ ఇదే
ప్రభాస్ గిఫ్ట్ గా ఇచ్చిన చీరను.. మూడేళ్లు దాచుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?